Pooja Hegde: బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఆర‌బోస్తూ అగ్గి రాజేసిన పూజా హెగ్డే

Pooja Hegde: పూజా హెగ్డే.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.ప్ర‌స్తుతం తెలుగు,త‌మిళం,హిందీ భాష‌ల‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో నాగచైతన్య ఒక లైలాకోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ భామ ప్రభాస్ సరసన రాధేశ్యామ్’లో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లోను నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

పూజా ఇప్ప‌టికే తెలుగులో త‌న స‌త్తా చూపించింది. ఇటీవ‌ల వచ్చిన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో తెగ అల‌రించిన పూజా బుట్ట‌బొమ్మ‌గా మారింది. ఇక హిందీలోను దూసుకుపోతుంది. త‌మిళంలోను త‌న స‌త్తా చాటాల‌ని భావిస్తుంది. తమిళ్ సినిమాతోనే ఈ ముద్దగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. జీవ హీరోగా నటించిన మాస్క్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు తమిళ్ లో దళపతి విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలోనూ పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తుంది.

పూజా హెగ్డే న‌టించిన రాధే శ్యామ్ విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా వ‌ల‌న బ్రేక్ ప‌డింది. ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. 1960ల నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుంది. ఇందులో ప్రేర‌ణ అనే పాత్ర‌లో కనిపింఇచ అల‌రించ‌నుంది. ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్ – యూవీ క్రియేషన్స్ – టీ సిరీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో పూజాహెగ్డే కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తైనట్లు తెలుస్తోంది.

రాధేశ్యామ్ చిత్రం మంచి విజ‌యం సాధిస్తే పూజాకి ఇక అడ్డే ఉండ‌దు. ఈ అమ్మ‌డు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మార‌డం ఖాయం. రీసెంట్‌గా విజయ్ తో కలిసి నటిస్తున్న ‘బీస్ట్’ షూటింగ్ లో పూజా జాయిన్ అయినట్లు సమాచారం. చెన్నైలో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో విజయ్ – పూజా లపై సాంగ్ ను చిత్రీకరించనున్నారు. షూటింగ్ కోసం చెన్నై లో ల్యాండ్ అయిన ఈ అమ్మడు అక్కడకు మినీ స్కట్ లో వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది.

తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఈ అమ్మ‌డు గ్లామ‌ర్ షో చేసింది. తొడ‌లు క‌నిపించేలా డిఫ‌రెంట్ స్టైల్‌లో ఫొటో షూట్ చేసిన పూజా హెగ్డే కుర్ర‌కారుకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. పూజాని ఈ లుక్‌లో చూసిన అభిమానులు కామెంట్ల వ‌ర్షం కురిపించ‌కుండా ఉండలేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం పూజా ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.