Pooja Hegde: ఎయిర్ పోర్ట్‌లో స్ట‌న్నింగ్ లుక్‌లో క‌నిపించిన పూజా హెగ్డే.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌

Pooja Hegde: టాలీవుడ్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో పూజా క్రేజ్ మ‌రింత పెరిగింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి చేతిలో తెలుగు,తమిళంతో పాటు హిందీ భాష‌ల‌లో సినిమాలు చేస్తుంది. పూజా న‌టించిన‌ ‘రాధే శ్యామ్‌’,’ఆచార్య’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోన్న పూజ ఇటీవల ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమాతో మన ముందుకు వచ్చింది.

Pooja Hegde Latest Stills in Airport
Pooja Hegde Latest Stills in Airport

ప్రస్తుతం థియేటర్లలో ‘విభా’ గా అలరిస్తున్న ఈ అందాల తార అంద‌రి మ‌న‌సుల‌ని దోచుకుంది. స్టార్ హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన పూజాకు సాలు ఏమాత్రం టైమ్ దొర‌కడం లేద‌ని.. త‌నతో ఫోన్లో మాట్లాడాల‌న్నా ఆమె డేట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇటీవ‌ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ వేడుక‌లో హ‌రీష్ శంక‌ర్ చెప్పిన విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల పూజా ప‌లు విష‌యాలు తెలియ‌జేసింది. ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం గురించి అడగగా.. అది పీరియాడిక్ లవ్ స్టోరీ.. చాలా గొప్పగా ఉంటుంది. అద్భుతమైన‌ విజువల్స్ తో ఉంటుంద‌ని చెప్పింది. ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని కోరితే స్వీటెస్ట్ అని.. క‌న్న‌డ స్టార్ హీరో యశ్ గురించి ఒక్క ముక్కలో చెప్పండి అని అడిగితే అడగగా కన్నడ సినీ పరిశ్రమ గర్వ పడే స్టార్ అని చెప్పింది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పూజా హెగ్డే.. అప్పుడ‌ప్పుడు హాట్ ఫొటోల‌తో రెచ్చ‌గొడుతూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హాట్ లుక్స్ వైర‌ల్‌గా మారాయి. ఎయిర్ పోర్ట్‌లో త‌ళుక్కున మెరిసిన పూజాని చూసి అంద‌రు స్ట‌న్ అవుతున్నారు.