Pooja hegde : బుట్టబొమ్మ హొయలు.! కుర్రకారు గుండెల్లో రేపుతున్నాయ్ సెగలు.!
NQ Staff - September 23, 2022 / 07:59 AM IST

Pooja hegde : బుట్టబొమ్మ పూజా హెగ్దే గ్లామర్ మ్యాజిక్ కుర్రకారుని ఫిదా చేస్తోంది. ఓ మ్యాజిక్ షోకి హాజరైన పూజా హెగ్దే ఏవేవో మ్యాజిక్ ట్రిక్స్ చేసేస్తోంది. ఇప్పుడీ వీడియోలూ, ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయ్.

Pooja hegde latest Crazy Photoshoot
ఈ మ్యాజిక్ షోకి డిఫరెంట్ లుక్స్‌లో హాజరైంది పూజా హెగ్దే. పూజా హెగ్దే ఏం చేసినా ముచ్చటగానే వుంటుంది.అదేంటో, నిండైన పట్టుచీరలో కనిపించినా, టూ పీస్ బికినీ షో చేసినా ఆ కిక్కే వేరే లెవల్.

Pooja hegde latest Crazy Photoshoot
చక్కనమ్మ ఏం చేసినా అందమే.! ఇక తాజా డ్రస్ విషయానికి వస్తే, పెద్ద పెద్ద బుట్ట చేతుల టాప్ ధరించి అచ్చు బుట్టబొమ్మలాగే కనిపిస్తోంది. బోటమ్‌లో బెల్‌బాటమ్ ప్యాంట్ ధరించింది. పెద్ద పాకెట్లు వున్న ఈ ప్యాంట్, ఆ బుట్ట చేతుల బ్లౌజుకి విపరీతమైన అందాన్ని తెచ్చేసింది.

Pooja hegde latest Crazy Photoshoot
జీన్స్‌పై బ్లౌజ్.. అందులోనూ పెద్ద పెద్ద బుట్ట చేతులూ.. పోలా అదిరిపోలా.. అందుకే ఈ ఫోటోలకు పూజా హెగ్దే ఫ్యాన్స్ తెగ ఫిదా అయిపోతున్నారు. ఇక, ఎప్పటిలాగే క్యూట్ అప్పీల్‌తో పిచ్చెక్కిస్తోంది పూజా హెగ్దే.

Pooja hegde latest Crazy Photoshoot
ప్రస్తుతం పూజా హెగ్దే, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రీసెంట్‌గా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో పూజా హెగ్దే పాల్గొననున్నట్లు సమాచారం.