Pooja Hegde : బుట్టబొమ్మ గోల్డెన్ లుక్స్.! కేక పుట్టిస్తున్న పూజా హెగ్దే హోయలు.!
NQ Staff - December 26, 2022 / 06:05 PM IST

Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్దేకి 2022 ఏమంత కలిసి రాలేదని చెప్పాలి. చేయడం వరుస పెట్టి సినిమాలు చేసేసింది. కానీ, ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో, అది పూజా కెరీర్‌కి డ్యామేజ్ అవుతుందని భావించారంతా.

Pooja Hegde Latest Beautiful Photos
కానీ, మేడమ్ సార్ మేడమ్ అంతే. పూజా హెగ్దే కెరీర్‌కి ఆ ఫెయిల్యూర్స్ ఎంత మాత్రమూ డ్యామేజ్ కాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో సూపర్ స్టార్ మహేష్‌కి జోడీగా నటిస్తోంది పూజా హెగ్డే.
మేడమ్ సార్ మేడమ్ అంతే.!

Pooja Hegde Latest Beautiful Photos
అలాగే, పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ పూజా హెగ్డేనే హీరోయిన్. సౌత్ సినిమాలతో పాటూ, నార్త్‌లోనూ పూజా మేడమ్ సార్ మేడమ్ అంతే.
నార్త్‌లో పూజా చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయ్. అందులో ఒకటి సల్మాన్ ఖాన్ సినిమా. కాగా, ఇటీవలే కాలి గాయం కారణంగా కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకున్న పూజా హెగ్దే, ఈ మధ్యనే గాయం నుంచి కోలుకుని సెట్స్‌లో అడుగు పెట్టింది.

Pooja Hegde Latest Beautiful Photos
క్రిస్‌మస్ సందర్భంగా ముద్దుగుమ్మల అందాల హవా కొనసాగుతున్న వేళ పూజాహెగ్దే కూడా తానేం తక్కువ కాదంటూ గోల్డెన్ ఔట్ ఫిట్‌లో మెరుపులు మెరిపించింది. స్టైలిష్ లుక్స్‌తో పూజా హెగ్దే అదిరిపోయే పోజిచ్చింది. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.