Pooja Hegde: పూజాకు మెసేజ్ చేసిన అల్లు అర‌వింద్.. చాలా భ‌యమేసింద‌ని బుట్ట‌బొమ్మ‌ కామెంట్

Pooja Hegde :ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒక‌రు.అందం, అభిన‌యం ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ బాష‌ల‌లో సినిమాలుచేస్తూ సంద‌డి చేస్తుంది. మొదట్లో పూజా నటనను చూసి పెదవి విరిచిన సినీ జనాలకు, మెల్లగా ఆమె అలవాటు అయ్యారు. సినిమా సినిమాకు పరిపక్వత సాధిస్తూ, బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్నారు.

ఈ మధ్య సొంతగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది పూజా. అరవింద సమేత చిత్రానికి మొదటిసారి స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న ఆమె, 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో కూడా సొంత గొంతునే వాడుకున్నారు. బిజీ హీరోయిన్‌గా మారిన పూజా హెగ్డే రెమ్యున‌రేషన్‌ విష‌యంలోను భారీగా పెంచిన‌ట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం పూజా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ చిత్రాలు చేస్తున్నారు. చిరు-చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ఆచార్యలో ఆమె చ‌ర‌ణ్‌ తో జత కడుతున్నారు. ఆచార్యలో పూజా ట్రెడిషనల్ లుక్ అద్భుతంగా ఉంది. విజ‌య్ బీస్ట్ చిత్రం చేస్తుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ లేటెస్ట్ మూవీ కభీ ఈద్ కభీ మహేష్ త్రివిక్రమ్ చిత్రంతో పాటు, హరీష్ శంకర్-పవన్ చిత్రాలలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా అవ‌కాశం పొందింది.

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలోను పూజా న‌టించ‌గా, ఈ అమ్మ‌డు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అర‌వింద్‌పై కొన్ని క్యూట్ కామెంట్స్ చేసింది. నాకు ఇష్టమైన నిర్మాత అల్లు అరవింద్. ఈ విషయం నాలుగు ఐదురోజుల క్రితం జరిగింది. నేను షూటింగ్‌కు వెళ్తున్నాను. కారులో ఉన్నాను. ఆ సమయంలో నాకు మెసెజ్ వచ్చింది. పైన నోటిఫికేషన్‌లో అల్లు అరవింద్ గారు అని కనిపించింది. ఏం చేశారు? ఎందుకు చేశారు? అని తెగ భయపడ్డాను. ఆయన మామూలుగా అయితే మెసెజ్ చేయరు అని అనుకున్నాను.

ఎంతో బాగా నటించావ్.. అని ప్రశంసలు కురిపించారు. అలా ఆయన స్థాయికి ఆ మెసెజ్ చేయాల్సిన పని లేదు. కానీ ఆయన చెప్పారు. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది. ఇక అల్లు అరవింద్ కూడా తన స్పీచులో పూజా హెగ్డే గురించి గొప్పగానే చెప్పాడు. ‘నువ్వు అన్నా, నీ నటన అన్నా నాకు ఎంతో ఇష్టం. అది మా సినిమాల్లో పని చేసినా, వేరే సినిమాల్లో పని చేసినా సరే నువ్వంటే నాకు ఇష్టం’ అని అల్లు అరవింద్ అన్నాడు. మొత్తానికి పూజా మాత్రం బాగానే హైలైట్ అయింది.