Pooja Hegde: తెగ మురిసిపోతోందిగా… పూజా హెగ్డే వీడియో వైరల్

Pooja Hegde టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అల్లరిని చూడాలంటే ఆమె సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాల్సిందే. తెర పై ఎంత క్యూట్‌గా ఉంటుందో.. ఎంత ముద్దుగా మాట్లాడుతుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా చేస్తుంది. పూజా హెగ్డే సోషల్ మీడియాను ఎలా వాడాలో అలా వాడుతూ ఉంటుంది. సినిమాలున్నా లేకపోయినా కూడా పూజా హెగ్డే మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది.

చేతిలో ఏ సినిమాలు లేకపోతే.. సెట్‌లో కాకుండా ఇంట్లో ఉంటే.. పూజా హెగ్డే చేసే సందడి ఒకరంగా ఉంటుంది. ఇక పూజా హగ్డే సెట్‌లో చేసే రచ్చ మరోలా ఉంటుంది. లాక్డౌన్‌లో పూజా హెగ్డే తన ఇంట్లో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. చుట్టూ కజిన్స్ ఉంటే.. మహారాణిలా కూర్చుని సేవలు చేయించుకుంది. ఒకరు చేతికి, ఇంకొకరు కాలికి, మరొకరు తలకి మసాజ్ చేస్తుంటే పూజా హెగ్డే మాత్రం స్వర్గంలో తేలిపోయింది.

అలా లాక్డౌన్‌ను పూజా హెగ్డే బాగానే ఎంజాయ్ చేసింది. అయితే అందులో పూజా హెగ్డేకు ఓ చేదు అనుభవం మాత్రం ఎదురైంది. మజిలీ సినిమాన చూస్తూ సమంత పై పూజా హెగ్డే చేసిన కామెంట్లు వివాదానికి దారి తీశాయి. అది ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. హ్యాక్ అయిందంటూ పూజా హెగ్డే నాటకాలు ఆడటం, దాని పై సమంత సెటైరికల్ పోస్ట్‌లు చేయడం అందరికీ తెలిసిందే.

పూజా హెగ్డే ప్రస్తుతం రాధేశ్యామ్ సెట్‌లో సందడి చేస్తోంది. రోజూ సెట్‌లో కేకులు తింటూ, లంచ్ టైంకు స్పెషల్ ఐటెంలు ప్రిపేర్ చేయించుకుంటోంది. తాజాగా పూజా హెగ్డే ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో పూజా తన డ్రెస్‌ను చూసుకుని గిరగిరా తిరుగుతూ తెగ మురిసిపోతోంది. అలా కొన్ని సార్లు తిరగాల్సి వస్తుంది.. నవ్వుకోవాల్సి వస్తుందంటూ పూజా హెగ్డే షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Advertisement