Pooja Hegde: డ‌బ్బింగ్ పూర్తి చేసిన ప్రేర‌ణ‌.. ఇక సంక్రాంతికి సంద‌డి చేయ‌బోతున్న రాధేశ్యామ్

Pooja Hegde: అభిమానులు ఎప్పుడా ఎన్న‌డా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న రాధే శ్యామ్ చిత్రం శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. పీరియాడికల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక.

Pooja hegde Completes Her Dubbing For Radhe Shyam Movie
Pooja hegde Completes Her Dubbing For Radhe Shyam Movie

తాజాగా ‘రాధేశ్యామ్’ లో తన పాత్రకు డబ్బింగ్ మొత్తం పూర్తిచేసింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర పేరు ‘ప్రేరణ’. ‘ప్రేరణ’ డబ్బింగ్ చెప్పేసిందంటూ ‘రాధేశ్యామ్’ చిత్రబృందం ట్విట్టర్ లో వెల్లడించింది. రిలీజ్ దిశగా మరో అడుగు ముందుకేశామని వివరించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీగా రూపొందింది.

ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల చేసిన టీజర్, రెండు పాటలను చూసిన ప్రేక్షకులు ఒక్కొకటి ఒక్కోలా ఈ లవ్ స్టోరీ ఇలా ఉండబోతుందని.. ఒక్కో పాత్ర ఇలా ఉండబోతుందని ప్రిడిక్షన్లు కూడా మొదలు పెట్టారు. టీజర్ వచ్చిన కొత్తలోనే ప్రభాస్ పాత్ర రివీల్ చేసిన మేకర్స్ అంతర్లీనంగా కథను కూడా చెప్పేశారు.

ప్రభాస్ చేతి రేఖలు చూసి జాతకాలు చెప్పడం వృత్తి కాగా.. పూజ పాత్ర పేరు ప్రేరణ అని కూడా రివీల్ చేశారు. ఈ సినిమాలో ప్రేరణ పూజా హెగ్డే పోషించిన క్యూట్ పాత్రను విషాదాంతంగా ముగించనున్నట్లుగా అర్ధమవుతుంది. ఎంతో ఫేమస్ పామిస్ట్ అయ్యిన విక్రమాదిత్య ఆమె చనిపోయాక ఆమె జ్ఞాపకాల్లో ఉంటాడేమో అనిపిస్తుంది.

ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ను బట్టి చూస్తే ఫేమస్ పామిస్ట్ అయ్యిన విక్రమాదిత్య ప్రేరణ మరణం అనంతరం ఆమె జ్ఞాపకాల్లోనే గడపడం.. ఆ తర్వాత కథ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఇదంతా అప్డేట్స్ ను చూసి అంచనాలు మాత్రమే కాగా అసలు సినిమాలో ఏ పాత్ర ఎలా ఉండబోతుందన్నది సినిమా వచ్చే వరకు వేచిఉండాల్సిందే.