Pooja Hegde: గోల్డెన్ లెగ్‌గా మారిన పూజా హెగ్డే హీట్ పెంచుతుందిగా..!

Pooja Hegde అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఇప్పుడు క‌ల‌ల రాణిగా మారింది. అభిమానుల‌కే కాకుండా హీరోల‌కు కూడా ఈ అమ్మ‌డు బెస్ట్ ఆప్ష‌న్‌గా మారింది. టాలీవుడ్‌లో కొంత కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. చూపు తిప్పుకోకుండా చేసే అందమే కాదు.. అద్భుతమైన నటనను కనబరుస్తూ ఆకట్టుకుంటోంది. త

చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయిన ఈ భామ.. సోషల్ మీడియాలో సైతం భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇందులో భాగంగానే తరచూ అందాల విందు చేస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీని అందుకుంది.తాజాగా పూజా హెగ్డే స్టైలిష్ డ్రెస్‌లో ఆక‌ట్టుకుంటుంది.

బ్లాక్ బికినీ ధరించి ఇదిగో ఇలా థై షోస్ చేస్తూ వయ్యారంగా ఫొటోలకు పోజులిచ్చింది. బికినీపై లాంగ్ కోట్ తో కవర్ చేసినా పూజా అందాలు దాగడం లేదు. పూజా ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. పూజ తమిళ క్రేజీ హీరో ఇలయదళపతి విజయ్ నటిస్తున్న `బీస్ట్`లో చేస్తున్న విషయం తెలిసిందే.

ఆమె నటించిన రాధేశ్యామ్- ఆచార్య చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అదిరిపోయే ఆరంభాన్ని అందుకోలేకపోయినా పూజా హెగ్డే.. ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

ఆ తర్వాత వరుసగా ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి హిట్లను అందుకుని స్టార్ హీరోయిన్ అయింది. అలాగే రెమ్యూనరేషన్‌ను పెంచేసి షాకిస్తోంది.