Ponniyin Selvan 2 Movie Review : పొన్నియిన్ సెల్వన్‌ 2 రివ్యూ

NQ Staff - April 28, 2023 / 09:16 AM IST

Ponniyin Selvan 2 Movie Review  : పొన్నియిన్ సెల్వన్‌ 2 రివ్యూ

Ponniyin Selvan 2 Movie Review  : మణిరత్నం దర్శకత్వంలో రూపొంది గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి తమిళనాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పొన్నియిన్ సెల్వన్‌ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్‌ 2’. ఈ సినిమా కోసం భారీ ఎత్తున పబ్లిసిటీ కార్యాక్రమాలు నిర్వహించారు. మొదటి పార్ట్‌ తెలుగు లో ఆకట్టుకోలేక పోయింది. కనీసం ఇది అయినా తెలుగు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
మొదటి పార్ట్ కు కొనసాగింపు అన్నట్లుగా సెకండ్ పార్ట్‌ మెగాస్టార్ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ తో పొన్నియిన్‌ సెల్వన్ 2 కథ ప్రారంభం అయ్యింది. ఆదిత్య పై ప్రతీకారం తీర్చుకోవడానికి అరుణ్‌ మోళి, నందిని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో పాండ్యన్ బృందాన్ని రక్షించడం మరియు మధురాంతకన్ ను లక్ష్యంగా చేసుకుని శివ భక్తులు కార్యకలాపాలు నిర్వహిస్తారు. చివరకు చోళ రాజ్యపు అత్యున్నత పీఠం ఎవరికి దక్కుతుంది అనేది కథ.

నటీనటుల నటన :

సినిమాలోని అన్ని ముఖ్య పాత్రలకు కూడా ప్రముఖ నటీ నటులను ఎంపిక చేసుకున్న మణిరత్నం అద్భుతమైన నటన రాబట్టారు అనడంలో సందేహం లేదు. హీరోలు విక్రమ్‌.. కార్తీ మరియు జయం రవిలు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. వారి యొక్క నటనతో సినిమా స్థాయిని పెంచారు అనడంలో సందేహం లేదు. ఇక బాలీవుడ్‌ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తన పాత్ర మరియు నటనతో సర్ ప్రైజ్‌ చేసింది. త్రిష అందంతో పాటు అభినయంతో మెప్పించింది. ఇక ప్రకాష్ రాజ్, ప్రభు, నాజర్ లు తమ పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

Ponniyin Selvan 2 Movie Review

Ponniyin Selvan 2 Movie Review

టెక్నికల్‌ :
దర్శకుడు మణిరత్నం సినిమా యొక్క అన్ని విభాగాలను అద్భుతంగా ముందుకు నడిపించాడు. ముఖ్యంగా సంగీతం అద్భుతంగా వచ్చింది. ఆకట్టుకునే విధంగా పాటలు ఉన్నాయి. అయితే బ్యాక్ గ్రౌండ్‌ విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ద పెట్టి ఉండాల్సింది. కథ విషయంలో తెలుగు ప్రేక్షకులకు కాస్త కన్ఫ్యూజన్ గా ఉండవచ్చు. కానీ స్క్రీన్ ప్లే బాగుంది. ఎడిటింగ్ విషయంలో కొన్ని లోటు పాట్లు ఉన్నాయి. ఇంకాస్త నిడివి తగ్గించి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రపీ అద్భుతంగా వచ్చింది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్‌ :

సినిమాటోగ్రఫీ,
నటీనటుల నటన,
స్క్రీన్‌ ప్లే.

మైనస్ పాయింట్స్ :

స్లో నేరేషన్‌
బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌
తమిళ ఫ్లేవర్‌

విశ్లేషణ :

పొన్నియిన్‌ సెల్వన్‌ మొదటి భాగం చూసిన వారికి సెకండ్ పార్ట్‌ పై ఆసక్తి ఉన్న మాట వాస్తవం. ఆ సినిమా చూసిన వారు తప్పకుండా సెకండ్‌ పార్ట్ ను ఆస్వాదిస్తారు. అయితే రెహమాన్ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. భారీ తారాగనం ఉండటం వల్ల సినిమా కు మంచి గ్రాండియర్ లుక్ వచ్చింది. ఈసారి తెలుగు లో కాస్త సందడి చేసే అవకాశాలు ఉన్నాయి.

                                                               రేటింగ్‌ : 
                                                               2.5/5.0

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us