Police Stopped Bhola Shankar Movie At SSV Theater : భోళాశంకర్ సినిమా నిలిపివేత.. అధిక ధరలకు టికెట్లు అమ్మతుండటంతో..!

NQ Staff - August 11, 2023 / 11:49 AM IST

Police Stopped Bhola Shankar Movie At SSV Theater : భోళాశంకర్ సినిమా నిలిపివేత.. అధిక ధరలకు టికెట్లు అమ్మతుండటంతో..!

Police Stopped Bhola Shankar Movie At SSV Theater :

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మూవీ భోళాశంకర్. తమిళ వేదాలం సినిమాకు రీమేక్ వస్తోంది. పైగా చాలా ఏళ్ల తర్వాత మెహర్ రమేశ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాగా ఈ సినిమాను ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా భారీగా విడుదల చేస్తున్నారు.

ఏపీలో ఈ సినిమా బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని కొంత మేర పెంచుకునే అవకాశాన్ని ఇచ్చారు. అయితే బాపట్లలోని SSV థియేటర్లో మాత్రం పర్మిషన్ లేకుండానే భోళాశంకర్ మూవీకి అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు నేరుగా వెళ్లి సినిమాను అడ్డుకున్నారు.

Police Stopped Bhola Shankar Movie At SSV Theater

Police Stopped Bhola Shankar Movie At SSV Theater

అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మొదటి నుంచి ఇలాంటి బ్లాక్ దందా మీద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ఇక మరికొన్ని చోట్ల కూడా ఇలా టికెట్లను బ్లాక్ లో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ దాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు జరుపుతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us