మ‌హిళ‌ల‌పై ‘కోయిల‌మ్మ’ సీరియ‌ల్ న‌టుడు దౌర్జ‌న్యం.. ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు

కోయిల‌మ్మ సీరియ‌ల్‌లో హీరోగా న‌టిస్తున్న న‌టుడు స‌మీర్ అలియాస్‌ అమ‌ర్‌పై సైబరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ స్వాతితో పాటు మ‌రో ముగ్గురు యువ‌కుల‌తో క‌లిసి బాధిత మ‌హిళ‌ల ఇంటికి వెళ్ళి వారిపై దౌర్జ‌న్యం చేయ‌డంతో పాటు బెదిరింపుల‌కు దిగాడు స‌మీర్. తాగిన మ‌త్తులో వీరంగం సృష్టించ‌డంతో భ‌య‌ప‌డ్డ ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లు ద‌గ్గ‌ర‌లోని పోలీస్ స్టేష‌న్‌కు వెళ్ళి స‌మీర్‌తో పాటు అత‌ని స్నేహితుల‌పై ఫిర్యాదు చేశారు.

వివరాలలోకి వెళితే శ్రీవిద్య, అపర్ణ‌లు కొద్ది రోజులుగా మ‌ణికొండ‌లో బొటిక్ వ్యాపారం చేసుకుంటున్నారు. వారితో ముందు మంచి రిలేష‌న్ మెయింటైన్ చేసిన స‌మీర్ ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అప్పుగా తీసుకున్నాడ‌ట‌. వాటిని చెల్లించాల‌ని మ‌హిళ‌లు ఒత్తిడి చేయ‌డంతో రాత్రి వాళ్లింటికి వెళ్లి దాడి చేయ‌డ‌మే కాకుండా వారి ద‌గ్గ‌ర ఉన్న వ‌స్తువుల‌ను లాక్కున్నాడ‌ని, లైంగిక దాడి చేసే ప్ర‌య‌త్నం కూడా చేశాడ‌ని మ‌హిళ‌లు చెప్పుకొచ్చారు. వారి నుండి మాకు ప్రాణ హాని ఉంద‌ని మ‌హిళ‌ల‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో స‌మీర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ కూడా ఇచ్చారు.

అయితే ఈ వివాదంపై స్పందించిన స‌మీర్ .. నాపై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతుంది. నిజనిజాలు ఏంట‌ని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అన్ని విష‌యాలు పోలీసుల ముందు చెబుతా. ఎవరికి సంజాయిషీ ఇచ్చుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు అని స‌మీర్ అన్నాడు. ఇదిలాఉంటే.. శ్రీ విద్య, స్వాతి, లక్ష్మి ఈ ముగ్గురూ కలిసి గ‌తంలో మణికొండలో బోటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపారలావాదేవీల్లో తేడాలు రావడం వల్ల స్వాతిబొటిక్ వ్యాపారం నుంచి తప్పుకుంది.త‌న‌కు రావ‌ల్సిన మొత్తం, ఇత‌ర లావాదేవీలు ఇవ్వ‌క‌పోవ‌డంతో బుధవారం రాత్రి స్వాతి కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్‌తో కలిసి శ్రీ విద్య ఇంటికి వెళ్లి నిలదీశారు. ఆ స‌మ‌యంలో మాట‌మాట పెరిగి వివాదం ఇంత పెద్ద‌దైంది.

Advertisement