Arrests : విరాట్ కూతురిని రేప్ చేస్తామ‌ని బెదిరించిన వ్యక్తి అరెస్ట్‌

NQ Staff - November 10, 2021 / 05:42 PM IST

Arrests : విరాట్ కూతురిని రేప్ చేస్తామ‌ని బెదిరించిన వ్యక్తి అరెస్ట్‌

Arrests : మారుపేర్లతో ముసుగేసుకున్న ఫేక్ రాయుళ్లు చిన్న పెద్ద అన తేడా లేకుండా సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. సోకాల్డ్ సామాజిక మాధ్యమాల్లో తిట్లపురాణాలు, బెదిరింపులు కొత్త కానప్పటికీ పసి పిల్లలనూ బెదిరించే స్థాయికి దిగజారింది. ఇటీవ‌ల‌ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురైన తొమ్మిది నెలల పసిపాప వమికాను రేప్ చేస్తానంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.

police arrests ramnagesh from hyderabad for indian cricketer daughter rape threats

police arrests ramnagesh from hyderabad for indian cricketer daughter rape threats

టీ-20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఓటమి తరువాత కోహ్లీ కూతురిని రేప్‌ చేస్తానని ఫోన్లో బెదిరించాడు హైదరాబాద్‌కు చెందిన అలిబత్తిని రాంనాగేశ్‌. 23 ఏళ్ల రాంనాగేశ్‌ను ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైకి తరలించి విచారణ జరుపుతున్నారు. మహ్మద్‌ సమీకి సపోర్ట్‌ ఇచ్చిన్నందుకు కోహ్లీని బెదిరించాడు రాంనాగేశ్‌.

police arrests ramnagesh from hyderabad for indian cricketer daughter rape threats

police arrests ramnagesh from hyderabad for indian cricketer daughter rape threats

పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోయిన తర్వాత.. జట్టులో ఏకైక ముస్లిం ఆటగాడైన మొహ్మద్ షమీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడం, దీనిని అన్ని రాజకీయ పార్టీలూ ఖండించడం విదితమే. కాగా, షమీకి మద్దతుగా కెప్టెన్ విరాట్ ప్రకటన చేస్తూ.. వెన్నెముకలేని మూకలంటూ ట్రోలర్లను నిందించాడు. ఆ తర్వాత ట్రోలర్లకు కోహ్లీ ఫ్యామిలీ టార్గెట్ అయింది. అత్యంత జుగుప్సాకరమైన రీతిలో కోహ్లీ కూతురిని రేప్ చేస్తామంటూ దుండగులు కామెంట్లు పెట్టారు.

‘విరాట్ కోహ్లీ, అనుష్క శర్మా.. మీరు సిగ్గుతో తలదించుకోవాలి.. మీ కూతురు(వమిక) ఫొటోలను ఎప్పుడెప్పుడు చూపిస్తారా.. ఎప్పుడు తనను రేప్ చేస్తానా అని ఎదురు చేస్తున్నా..’అంటూ క్రిక్ క్రేజీ గర్ల్స్ అనే ట్విటర్ యూజర్ బాహాటంగా కామెంట్లు పెట్టాడు.

తొమ్మిది నెలల పసికందు వమికను రేప్ చేస్తానంటూ ఇంత దారుణంగా దూషణలకు దిగిన అతనిపై కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుండగుడిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీ కార్యాలయానికి ట్యాగ్స్ చేశారు ఇంకొందరు. దుండగుడిది హైదరాబాదే అని వెల్లడైన తర్వాత అతను ట్విటర్ అకౌంట్లను డిలిట్ చేసుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ పోలీసులు చాక‌చ‌క్యంగా అత‌డిని అరెస్ట్ చేశారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us