Tollywood: సింగ‌ర్‌ని వేధించిన షార్ట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

Tollywood: ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా కూడా మ‌హిళ‌ల‌ని మానసికంగా వేధించ‌డం త‌గ్గ‌డం లేదు. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇవి చాలా ఎక్క‌వునే చెప్పాలి. కొంద‌రు అవ‌కాశాల కోసం మ‌హిళ‌ల‌ని మాన‌సికంగా, శారీర‌కంగా వేధిస్తూనే ఉన్నారు. బాధితులు బ‌య‌ట‌కు వ‌చ్చి చెబితే గాని ఇలాంటి ఆకృత్యాలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ సింగ‌ర్‌ని వేధించగా ఆమె పోలీసుల‌ని ఆశ్ర‌యించింది.

Tollywood

వివ‌రాల‌లోకి వెళితే నాగోలుకి చెందిన  మెడికాయల నవీన్‌కుమార్‌ (34) షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆయ‌న గ‌తంలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప‌ని చేస్తున్న ప్ర‌ముఖ ప్లే బ్యాక్ సింగ‌ర్‌తో ఇంట‌ర్వ్యూలు చేశాడు. ఆ త‌ర్వాత ఆమె ఫొటోను లోగోగా పెట్టి ఆమె పేరు మీద‌నే యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించాడు.

అనంతరం బాధితురాలి పేరు మీద చిత్ర నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాడు. ఇందులో తన వెబ్‌ సిరీస్‌ వీడియోలు, ఆల్బమ్‌ సాంగ్స్, షార్ట్‌ ఫిల్మ్స్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేశాడు. విష‌యం తెలుసుకున్న సింగ‌ర్ ఇలాంటి ప‌నులు చేయోద్ద‌ని హెచ్చ‌రించినా కూడా న‌వీన్ ఆగ‌లేదు.

సింగ‌ర్ వ్య‌క్తిగ‌త జీవితానాకి సంబంధించి వీడియోలు కూడా ఆమెను మాన‌సికంగా వేధించ‌డం మొద‌లు పెట్టాడు . దీంతో బాధితురాలి పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని శుక్రవారం నవీన్‌కుమార్‌ అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. అత‌డి నుండి మ‌రిన్ని విష‌యాలు రాబ‌ట్టేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.