Jeevitha : జియో పేరుతో జీవితను బురిడి కొట్టించిన కేటుగాడు

NQ Staff - November 23, 2022 / 10:30 AM IST

Jeevitha : జియో పేరుతో జీవితను బురిడి కొట్టించిన కేటుగాడు

Jeevitha : ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. చదువు రాని వారు సైబర్ మోసగాళ్ల బారిన పడుతున్నారు అనుకుంటే పొరపాటే.. బాగా చదువుకున్న వారు, ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసేవారు, సెలబ్రిటీస్ కూడా సైబర్ నేరగాల యొక్క మోసాలకు బలి అవుతున్నారు.

ఆ మధ్య ఒక టాలీవుడ్ దర్శకుడు సైబర్ మోసగాళ్ల యొక్క మోసానికి బలైపోయాడు. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ జీవిత రాజశేఖర్ కూడా సైబర్ మోసగాళ్ల యొక్క వలలో చిక్కింది. లక్ష రూపాయలు వరకు సొమ్ము పోగొట్టుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే జీవిత రాజశేఖర్ కి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు జియో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది నేనే.. ఇప్పుడు జియో వారు ఆఫర్ గా మీకు ఒక విలువైన బహుమానాన్ని ఇవ్వాలనుకుంటున్నారంటూ చెప్పాడు.

ఆ సమయంలో జీవిత తాను బిజీగా ఉన్నాను, తన మేనేజర్ తో మాట్లాడాలంటూ ఫోన్ తన మేనేజర్ కి ఇచ్చింది. అప్పుడు సదరు వ్యక్తి మేనేజర్ తో మాట్లాడుతూ తాను జియో లో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ యొక్క సేల్స్ మేనేజర్ గా బాధ్యతలు తీసుకున్నాను.

గతంలో మీకు నేను ఇంటర్నెట్ సేవలు అందించాను కనుక ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వస్తువులను మీకు ఆఫర్ కి ఇవ్వాలనుకుంటున్నాను. రెండున్నర లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను 1.25 లక్షల రూపాయలకు ఇవ్వాలనుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.

అందుకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్స్ పోస్టర్స్ ని కూడా చూపించాడు. దాంతో జీవిత రాజశేఖర్ మేనేజర్ అతడికి డబ్బులు ఆన్లైన్ ద్వారా పంపించాడు. వస్తువుల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగిలింది. అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అసలు విషయం తేలిపోయింది.

తామ మోస పోయినట్లుగా అర్థం అయి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను జీవిత రాజశేఖర్ యొక్క మేనేజర్ ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నెంబర్ మరియు బ్యాంక్‌ అకౌంట్‌ ఆధారంగా తమిళనాడుకు చెందిన నాగేంద్రబాబు అని తెలుసుకుని అతడిని అరెస్టు చేశారు. గతంలో కూడా నాగేంద్రబాబు ఇండస్ట్రీ వారిని టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడ్డాడు అంటూ పోలీసులు తెలియజేశారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us