pokiri: ‘పోకిరి చిత్రానికి 15 ఏళ్లు పూర్తి.. పండుగాడి రచ్చకు బాక్సాఫీస్ బద్దలు!

ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో.. వాడే పండుగాడు అంటూ 15 ఏళ్ల కింద పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ గుర్తే. సినిమా విడుదలైన తర్వాత ఇదే డైలాగ్ తిప్పి చెప్పారు ఫ్యాన్స్. ఎవడు కొడితే దిమ్మతిరిగి బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలైపోతాయో వాడే మహేష్ బాబు అంటూ కాలర్ ఎగరేసుకుని మరీ చెప్పారు. ఎప్రిల్ 28, 2006న పోకిరి విడుదలైంది. తొలిరోజు ఉదయం ఆటకు టాక్ కాస్త తేడాగా వచ్చింది. తుపాకీ సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి.. జస్ట్ ఓకే అన్నారు.. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరింది అనే టాక్ వచ్చింది. అయితే రెండు రోజుల తర్వాత మొత్తం మారిపోయింది. పోకిరి రికార్డుల వేట మొదలైంది. అప్పట్లో తెలుగు సినిమాకు కలగా ఉన్న 40 కోట్ల మార్క్ కు అతిచేరువగా వెళ్లింది పోకిరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ సోదరి మంజులతో కలిసి ఆయనే నిర్మించారు. మొదటి వారం సోసోగానే ఉన్నా రెండో వారం నుంచి పోకిరి దండయాత్రకు బ్రేకులు లేకుండా పోయాయి. ఈ సినిమా వచ్చిన వారం తర్వాత పవన్ కళ్యాణ్ ‘బంగారం’ సినిమా విడుదలైంది. కానీ పోకిరి ధాటికి తట్టుకోలేకపోయింది. 299 కేంద్రాల్లో 50 రోజులు, 200 కేంద్రాల్లో 100 రోజులు, 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏరియా వైజ్ కలెక్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

నైజాం-11.90 కోట్లు
సీడెడ్- 5.20 కోట్లు
ఉత్తరాంధ్ర- 3.00 కోట్లు
ఈస్ట్- 2.20 కోట్లు
వెస్ట్- 2.10 కోట్లు
గుంటూరు- 3.13 కోట్లు
కృష్ణా- 2.72 కోట్లు
నెల్లూరు- 1.20 కోట్లు

ఏపీ + తెలంగాణ (టోటల్)- 31.45 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 7.55 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 39.00 కోట్లు

15 ఏళ్ళ కింద పోకిరి సినిమాను 16 కోట్లకు అమ్మారు. మహేష్ బాబు గత సినిమాలతో పోలిస్తే అది మంచి రేట్. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం ఏకంగా 39 కోట్ల షేర్ వసూలు చేసింది. తద్వారా బయ్యర్లకు 23 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. పండుగాడి పేరు చెప్పుకుని డిస్ట్రిబ్యూటర్లంతా హ్యాపీగా సెటిల్ అయిపోయారు

Advertisement