Mihir das: సీనియ‌ర్ న‌టుడు క‌న్నుమూత‌.. దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని

Mihir das: సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సెల‌బ్రిటీలు కరోనా అయితేనేమి, ఇతర కార‌ణాల వ‌ల‌న అయితేనేమి క‌న్నుమూస్తుండ‌డం అంద‌రిని బాధిస్తుంది. తాజాగా 63 ఏళ్ల మిహిర్ దాస్ క‌న్నుమూసారు. మిహిర్ దాస్ ఏడాది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. ఆయన డయాలసిస్ కోసం తరచుగా ఆసుపత్రిలో చేరుతున్నారు.

pm condolenc ro mihir das
pm condolenc ro mihir das

ప్రైవేట్ ఆసుప‌త్రిలో మిహిరా దాస్‌కి వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తుండ‌గా, క‌న్నుమూసారు. ప్ర‌ముఖ న‌టుడు మ‌ర‌ణంపై చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మిహిర్ దాస్ మరణం తీరని విషాదం… ఒడిశా చిత్ర పరిశ్రమకు పూడ్చలేని లోటు అంటూ సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు.

ఇక ప్రధాని మోడీ సైతం మిహిర్ దాస్ మరణంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుండి సందేశం విడుదల చేశారు. మిహిర్ దాస్ మరణవార్త కలచివేసింది. ఏళ్ల తరబడిన సాగిన ఆయన నటప్రస్థానంలో అనేక మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపం.. అంటూ ట్వీట్ చేశారు.

Farm laws to be repealed: Highlights from PM Modi's speech - BusinessToday

ఫిబ్రవరి 11, 1959లో జన్మించిన మిహిర్ దాస్ నటనపై మక్కువతో పరిశ్రమకు వచ్చారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో 150కి పైగా చిత్రాలు చేశారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు చేశారు. తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించి.. అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు.