Phalana Abbayi Phalana Ammayi Movie Review : ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి రివ్యూ..!
NQ Staff - March 17, 2023 / 02:01 PM IST

Phalana Abbayi Phalana Ammayi Movie Review : అవసరాల శ్రీనివాస్ ఎలాంటి క్లాసిక్ సినిమాలు తీస్తారో అందరికీ తెలిసిందే. ఇక చాలా కాలం తర్వాత ఆయన నుంచి మరో సినిమా వచ్చింది. యంగ్ హీరో నాగశౌర్య హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్ గా చేసిన మూవీ ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి. ఈ సినిమా నేడు థియేటరల్లోకి వచ్చింది. నాగశౌర్య నుంచి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ ఏంటంటే..
సంజయ్ (నాగశౌర్య) బీటెక్ చదువుదామని జాయిన్ అవుతాడు. అయితే సీనియర్స్ ర్యాగింగ్ చేయాలని భావిస్తే.. అనుపమ (మాళవికా నాయర్) అతన్ని కాపాడుతుంది. తనను సేవ్ చేసిన కారణంగా ఆమెతో ఫ్రెడ్షిప్ చేస్తాడు సంజయ్. తర్వాత ఎంఎస్ కోసం లండన్ వెళ్ళినప్పుడు ప్రేమలో పడతారు. అనుపమ సీనియర్ కావడంతో త్వరగానే చదువు కంప్లీట్ అయి ఆమెకు జాబ్ వస్తుంది.
అయితే తనకు చెప్పకుండా వేరే సిటీకి వెళ్లినందుకు సంజయ్ కోప్పడుతాడు. ఇద్దరి నడుమ గ్యాప్ పెరుగుతుంది. ఈ క్రమంలోనే పూజ (మేఘా చౌదరి)తో స్నేహం మొదలు అవుతుంది. దాంతో సంజయ్, అనుపమ మధ్య దూరం మరింత పెరుగుతుంది. తర్వాత ఇద్దరూ ఎలా కలుస్తారు. మధ్యలో ఏం జరుగుతుంది అనేది మిగిలిన సినిమా.
ఎవరెలా చేశారంటే..
నాగశౌర్య ఎప్పటిలాగే లవర్ బాయ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయనకు ఇలాంటి పాత్రలు బాగా సూట్ అవుతాయని మరోసారి నిరూపించాడు. ఇక మాళవిక నాయర్ కూడా చాలా క్యూట్ గా కనిపించింది. ఆమె అందాలు సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. రొమాంటిక్ సీన్లలో వీరిద్దరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తేలికపాటి క్షణాలు, ఎమోషనల్ బిట్స్ ను అంతే ఈజీగా చేశారు. మిగతా పాత్రలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి.

Phalana Abbayi Phalana Ammayi Movie Review
టెక్నికల్ గా ఎలా ఉందంటే..
శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ మార్క్ మరోసారి కనిపించింది. కానీ సినిమాకు బాగా ప్లస్ అయిందంటే సినిమాటోగ్రఫీ. చాలా సీన్లలో కెమెరా పనితనం బాగానే కనిపించింది. ఇక మ్యూజిక్ అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాకు ఇది పెద్ద మైనస్. ఎందుకంటే లవ్ స్టోరీ సినిమాల్లో ఎక్కువగా పాటలే హైలెట్ గా నిలుస్తాయి. ఇక ఎడిటింగ్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి.
ప్లస్ పాయింట్లు..
హీరో, హీరోయిన్
కొన్ని డైలాగులు
మైనస్ పాయింట్లు..
కథలో డెప్త్ లేదు
వీక్ క్లైమాక్స్
చివరగా..
దర్శకుడు అవసరాల శ్రీనివాస్ సినిమాను చాలా రియలస్టిక్ గా తీయాలని భావించారు. కానీ చాలా విషయాల్లో తడబడ్డాడు. కథలో చాలా డెప్త్ ఉంటే బాగుండేది. అదే మిస్ అయినట్టు కనిపిస్తుంది. కాకపోతే కొన్ని సీన్లు బాగా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.
రేటింగ్ః 2.25/5