pawan kalyan : పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పవన్ క్రియేటివ్ వర్క్స్ కలిసి 15 సినిమాలు..!

pawan kalyan :  సినిమా ఇండస్ట్రీకీ హీరోలుగా దర్శకులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎదగాలని ఎంతో మంది వచ్చి  అవకాశాల కోసం ఇండస్ట్రీలో ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారన్నది వాస్తవమే. కానీ వాళ్ళకి అవకాశాలు ఇచ్చేదెవరు అంటే సమాధానం సైలెన్స్ మాత్రమే. ఎన్నో ఏళ్ళుగా యంగ్ టాలెంట్ వచ్చి అవకాశల కోసం రక రకాల ఇబ్బందులు పడుతున్న విషయం పలు సందర్భాలలో విన్నదే.. చూసిందే. టాలెంట్ ఉన్న వాళ్ళకి సరైన ప్లాట్‌ఫాం దొరకక నిరాశతో రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళ సంఖ్య మాటల్లో చెప్పలేనిది. ఫిల్మ్ నగర్ చుట్టు ప్రక్కల, ఇందిరా నగర్, కృష్ణ నగర్ ప్రాంతాలలో ఇలా అవకాశాల కోసం కళ్ళు కాయలు కాచేలా చూసే వారు.. కాళ్ళకున్న చెప్పులు అరిగిపోయేలా తిరిగేవాళ్ళు వందలమంది ఉంటే వాళ్ళలో కొంతమందికి ఎన్నో ఏళ్ళకి గాని ఒక అవకాశం దక్కడం లేదు.

people-media-factory-is-working-with-pawan-kalyan-works-for-15-movies
people-media-factory-is-working-with-pawan-kalyan-works-for-15-movies

అలాంటి వాళ్ళకి గొప్ప అవకాశాం కల్పించి కొత్త జీవితం ఇవ్వబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టి.జి.విశ్వప్రసాద్. పవన్ కళ్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా 15 సినిమాలను నిర్మిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నవతరం ఆలోచనలు కలిగిన రచయితలను, ఆ విధమైన కథలు చెప్పగలిగే దర్శకులను… బహు భాషల్లో మన కథలను తీసుకువెళ్లగలిగే ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ను స్థాపించాడు పవన్ కళ్యాణ్. ఈ బ్యానర్ నుంచి సినిమాలు నిర్మిస్తున్నాడు.

pawan kalyan : ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ నుంచి దాదాపు 10 చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

ఇక నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి. ద్వారా వరసగా చక్కటి సినిమాలను నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణాన్ని పక్కా ప్రణాళికతో ఈ నిర్మాణ సంస్థ ద్వారా
వరసగా సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ నుంచి దాదాపు 10 చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి. సంస్థల భాగస్వామ్యంలో సినిమాలను నిర్మించి యంగ్ టాలెంట్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. ఈ నిర్మాణ సంస్థల కలయికలో 6 పరిమిత చిన్న తరహా చిత్రాలు… 6 మధ్యతరహా చిత్రాలు… 3 భారీ చిత్రాలు నిర్మించబోతున్నారు. మొత్తానికి ఈ 15 సినిమాలతో నటీ, నటులు.. దర్శకులు, రచయితలతో పాటు పలువురు టెక్నీషియన్స్ కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం గొప్ప విషయం.

Advertisement