Sree Leela: ఈ కుర్ర హీరోయిన్ అదృష్టం మాములుగా లేదుగా.. ఆఫ‌ర్సే ఆఫ‌ర్స్

Sree Leela క‌న్న‌డ భామ‌ల‌కు టాలీవుడ్ ఎప్పుడు త‌ల‌పు తెరిచే ఉంచుతుంది.ఇప్ప‌టికే ప‌లువురు క‌న్న‌డ భామ‌లు టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కాగా, ఇప్పుడు మ‌రో ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి సంద‌డి చిత్రంలో త‌న‌ నటన, లుక్స్ పరంగా ఎంతో ఆకట్టుకున్న‌ శ్రీ లీల తొలి చిత్రంతోనే బాగా సక్సెస్ అయింది.

TheNewsQube-

మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ జాబితాలో ఆమె చేరిపోయింది. రాఘవేంద్రుడి దర్శకత్వ పర్యవేక్షణలో తనదైన అభినయం, అందచందాలతో అట్రాక్ట్ చేసింది. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందD సినిమాలో శ్రీ లీల నటనకు మంచి మార్కులు పడ్డాయి.

 

వెండితెరపై శ్రీ లీల అందాలకు యువత ఫిదా అవుతోంది. మరోవైపు దర్శకనిర్మాతలు సైతం ఈ కొత్త అందానికి ముగ్దులయ్యారు. దీంతో అమ్మడికి ఆదిలోనే బంపర్ ఆఫర్స్ వస్తున్నాయి. అందంతో పాటు అంతకు మించిన చలాకీతనం ఉన్న శ్రీ లీలను హీరోయిన్‌గా తీసుకోవడానికి చాలామంది దర్శకనిర్మాతలు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది.

కాస్త బొద్దుగా, చూడ‌గానే ఆక‌ట్టుకునేలా ఉంది శ్రీ‌లీల‌. పైగా డాన్సుల్లో ఈజ్ చూస్తే మ‌తి పోయింది. రాఘ‌వేంద్ర‌రావు ఫ్రేమ్ లో… శ్రీ‌లీల మ‌రింత అందంగా క‌నిపించింది. నిజానికి ఈసినిమా విడుద‌ల‌కు ముందే.. శ్రీ‌లీల దృష్టి టాలీవుడ్ పై ప‌డింది. ర‌వితేజ సినిమాలో శ్రీ‌లీల హీరోయిన్ గా ఫిక్స‌య్యింది.

ఇప్పుడు రిలీజ్ అయ్యాక‌.. మ‌రిన్ని అవ‌కాశాలు వ‌రుస క‌డుతున్నాయి. శ‌ర్వా, నితిన్‌, నిఖిల్, సాయిధ‌ర‌మ్ తేజ్‌.. ఇలాంటి యంగ్ బ్యాచ్ ప‌క్క‌న శ్రీ‌లీల అయితే బాగుంటుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. కొత్త హీరోల‌కైతే త‌ను మంచి ఆప్షనే. ఇప్ప‌టికి త‌న చేతిలో నాలుగు సినిమాలున్నాయని తెలుస్తోంది. కొత్త‌గా మ‌రో రెండు ఆఫ‌ర్లూ వ‌చ్చాయ‌ట‌.