Nandamuri Balakrishna : బాలయ్య వస్తేనే తాళి కడుతా.. పెండ్లిని వాయిదా వేసిన పెండ్లి కొడుకు..!
NQ Staff - March 10, 2023 / 10:58 AM IST

Nandamuri Balakrishna : మన తెలుగు హీరోలకు ఉన్నంత మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఇంకెవరికీ ఉండరేమో అని చెప్పుకోవాలి. ఎంతలా అంటే.. వారిని ఒకసారి చూసినా జన్మ ధన్యం అన్నట్టే ఫీల్ అయిపోతూ ఉంటారు అభిమానులు. ఇంకా కొందరు అయితే తమఅభిమాన హీరోల ఫొటోలను టాటూలుగా కూడా వేయించుకుంటారు. ఇక తాజాగా ఓ అభిమాని చేసిన పని అయితే అందరికీ షాక్ ఇస్తోంది.
నందమూరి నటసింహం బాలయ్యకు వీరాభిమానులు చాలామందే ఉన్నారు. అయితే తాజాగా ఓ అభిమాని మాత్రం బాలయ్య వస్తేనే పెండ్లి చేసుకుంటాను అంటూ.. దాదాపు నాలుగేండ్లుగా పెండ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తున్నాడు. విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, చింతల అగ్రహారానికి చెందిన కోమలీ పెద్దినాయుడుకు గౌతమీ ప్రియలకు 2019లోనే ఎంగేజ్మెంట్ జరిగింది.
బిజీ షెడ్యూల్ వల్ల..
అయితే బాలయ్యకు వీరాభిమాని అయిన పెద్దినాయుడు తన పెండ్లికి బాలయ్య వస్తేనే పెండ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. వైజాగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా బాలయ్యకు ఆహ్వానం కూడా పంపాడు. అప్పుడు బాలయ్య బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయాడు. తర్వాత లాక్ డౌన్ రావడం, ఇతర కారణాలతో పెండ్లి వాయిదా పడుతూ వచ్చింది.

Peddinayudu Decided Get Married Only When Nandamuri Balakrishna Came
రెండు మూడు సార్లు బాలయ్య వస్తే పెండ్లి చేసుకోవాలని ముహూర్తాలు కూడా మార్చేశాడు. కానీ షూటింగుల వల్ల బాలయ్య రాలేకపోయాడు. ఇక చివరకు ఈ మార్చి 11న మ్యారేజ్‌కు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. బాలయ్య వస్తానని చెప్పారని పెద్దినాయుడు చెబుతున్నారు.
పెండ్లి కూతురు కూడా బాలయ్యకు వీరాభిమానే అని అందుకే ఇన్ని రోజులు ఆగిందని చెబుతున్నాడు పెద్దినాయుడు. బాలయ్య రాక కోసం తమ ఊరంతా ఎదురు చూస్తోందని అన్నారు పెద్దినాయుడు.