ఎన్టీఆర్ నాతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు.. సంచ‌ల‌న కామెంట్స్ చేసిన పాయ‌ల్

Samsthi 2210 - November 6, 2020 / 03:39 PM IST

ఎన్టీఆర్ నాతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు.. సంచ‌ల‌న కామెంట్స్ చేసిన పాయ‌ల్

బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్‌పై న‌టి పాయ‌ల్ ఘోష్ లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘట‌న‌పై ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతుంది. అయితే ఈ వివాదంలో హ్యుమా ఖురేషి, రిచా చద్దా, మహిగిల్‌ వంటివారిని కూడా లాక్కొచ్చింది పాయ‌ల్ ఘోష్‌. త‌న‌కు న్యాయం జ‌రిగేలా చూడాలంటూ మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌తో పాటు జాతీయ మ‌హిళా క‌మీష‌న్‌ని కూడా క‌లిసింది. ఇక ఇటీవ‌ల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) లో చేరారు. ఆమెకు పార్టీ జెండా అందజేసి కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ అధినేత రామ్‌దాస్ అథవాలే స్వాగతం పలికారు.

payal ntr

పాయ‌ల్ ఘోష్ త‌న వివాదంలోకి ఎన్టీఆర్‌ని తీసుకొచ్చి ర‌చ్చ చేస్తుంది.అనురాగ్ క‌శ్య‌ప్‌ని క‌లిసిన స‌మ‌యంలో ఆయ‌న ఏమేం మాట్లాడో నెట్టింట వివరించింది. ఇవి ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. ఊసర‌వెల్లి చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించిన పాయ‌ల్ ఘోష్ హ‌సీ ఫ‌సీ సినిమా గురించి చర్చించేందుకు అనురాగ్ క‌శ్య‌ప్‌ని క‌లిసింద‌ట‌. ఆ స‌మ‌యంలో రిఫరెన్స్ కోసం ఊస‌రవెల్లి సినిమాని మేనేజ‌ర్ చెప్ప‌డంతో చూపించాను. అప్పుడు అనురాగ్ .. ఎన్టీఆర్ కూడా నిన్ను వాడాడా.. సతీ సావిత్రిలా ఎక్కువగా నటించకు అంటూ నీచ‌మైన మాట‌లు మాట్లాడాడ‌ని చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడిన పాయ‌ల్ ఘోష్ త‌ను ఎప్పుడు నాతో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. దక్షిణాది స్టార్స్ వ‌ద్ద నాకు మంచి వాతావ‌ర‌ణం క‌నిపించింది. వారిలో ఎప్పుడు త‌ప్పుడు స్వ‌భావం కనిపించ‌లేదంటూ స్టన్నింగ్ కామెంట్స్ చేసింది పాయ‌ల్ ఘోష్‌. ప్ర‌స్తుతం పాయ‌ల్ ఘోష్ వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే పాయ‌ల్ చేసిన ఆరోప‌ణ‌ల‌తో ముంబై పోలీసులు అనురాగ్ క‌శ్య‌ప్‌ని విచారించిన విష‌యం తెలిసిందే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us