Payal Rajput: బొమ్మల చొక్కా ధరించిన పాయల్.. చిన్న పిల్లల మనస్తత్వం పోలేదా అంటూ కామెంట్
Tech Sai Chandu - September 27, 2021 / 08:43 PM IST

Payal Rajput: ఆర్ఎక్స్100 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ఈ అమ్మడు తొలి సినిమాతోనే మంచిగానే అలరించిన కూడా తర్వాత అంతగా ఆకర్షించలేకపోయింది. పాయల్.. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది.
పాయల్… డిస్కోరాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు. తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది.
తమిళంలో కూడా కొన్ని చిత్రాలు చేస్తోంది. గ్లామర్ పరంగా తనకు తిరుగులేదని నిరూపించుకున్న పాయల్.. సక్సెస్ రేట్ కూడా పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. పాయల్ రాజ్ పుత్ అందాలకు కుర్రాళ్లు దాసోహమవుతున్నారు.
తాజాగా పాయల్ రాజ్ పుత్ పూల దుస్తులు ధరించిన డ్రెస్‌లో మెరిసింది. దీనిని చూసిన నెటిజన్స్.. పాయల్‌కు చిన్నపిల్లల మనస్తత్వం పోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పాయల్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.