Payal Rajput: చీర‌క‌ట్టులోను తెగ క‌వ్విస్తున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌… క్యూట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తుందిగా..!

NQ Staff - May 15, 2022 / 12:43 PM IST

Payal Rajput: చీర‌క‌ట్టులోను తెగ క‌వ్విస్తున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌… క్యూట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తుందిగా..!

Payal Rajput: ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్.బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రచ్చ చేసింది. ఇది హిట్ అవడంతో పాటు పాయల్‌కు మంచి పేరు దక్కింది. దీంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ సొంతమైంది.

Payal Rajput Latest Beautiful Photos

Payal Rajput Latest Beautiful Photos


ఫస్ట్ మూవీతోనే యమ ఫోకస్ అయిన పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో ఆఫర్లు వెల్లవెత్తాయి. ఈ క్రమంలోనే ‘RDX లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి పలు సినిమాల్లో నటించి అలరించింది. అంతేకాదు, ‘అనగనగా ఓ అతిథి’ అనే ఓటీటీ చిత్రంతో పాటు ‘త్రీ రోజెస్’ అనే సిరీస్‌లలోనూ నటించింది. అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లను కూడా చేసి మెప్పించింది.
Payal Rajput Latest Beautiful Photos

Payal Rajput Latest Beautiful Photos


వరుస సినిమాలతో టాలీవుడ్‌లో సందడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. పర్సనల్ లైఫ్‌ను కూడా యమ ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె సౌరభ్ డింగ్రా అనే నటుడితో లవ్ ట్రాక్ నడపడమే. గత ఏడాది అతడు తల్లిని కోల్పోవడంతో పాయల్‌తోనే కలిసుంటున్నాడు. దీంతో పెళ్లికి ముందే వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇక, ‘త్రీ రోజెస్’లో సౌరభ్ హీరోగా పరిచయం అయ్యాడు.
Payal Rajput Latest Beautiful Photos

Payal Rajput Latest Beautiful Photos


ఇపుడు మంచు విష్ణు తో పాయ‌ల్ గాలి నాగేశ్వ‌రరావు అనే తెలుగు చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. గ్యాంగ్ స్ట‌ర్ గంగ‌రాజు ఫేం ఇషాన్ సూర్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. నెట్టింట్లో ఏదో ఒక అప్ డేట్‌ను అభిమానులు ఫాలోవ‌ర్ల‌తో షేర్ చేసుకునే పాయ‌ల్ స‌ర‌దా స్టిల్‌ను అంద‌రితో పంచుకుంటుంది. షూటింగ్ లొకేష‌న్‌లో స‌ర‌దాగా విష్ణు ప‌క్క‌నే నిద్ర‌పోయిన‌ట్టుగా కెమెరాకు ఓ ఫోజు ఇచ్చింది. ఇటీవ‌ల ఆ పిక్ షేర్ చేయ‌గా, వైర‌ల్ అయింది.

తాజాగా చీర‌క‌ట్టులోచాలా అందంగా క‌నిపించింది పాయ‌ల్. ఎప్పుడు బోల్డ్ లుక్స్‌తో క‌నిపించే ఈ ముద్దుగుమ్మ ఒక్క‌సారిగా ఇలాంటి అవ‌తారం ఎత్తే స‌రికి అంద‌రు షాక్లో ఉన్నారు. ప్ర‌స్తుతం పాయ‌ల్ క్యూట్ పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Read Today's Latest పిక్ టాక్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us