Payal: బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన పాయ‌ల్ రాజ్‌పుత్

Payal: బుల్లితెర బిగ్ రియాలిటీ షో కార్య‌క్ర‌మంతో చాలా మంది స్టార్స్‌గా మారుతున్నారు. ఈ షోకి వెళ్ల‌క‌ముందు వారి ముక్కు మొహం కూడా ఎవ‌రికి తెలియ‌దు. గ‌త సీజ‌న్ చూస్తే సోహెల్,అరియానా,అఖిల్ వంటి వారు చాలా మందికి కొత్త‌. కాని వారే ఇప్పుడు టాప్ సెల‌బ్రిటీస్‌గా మారారు. ఇక బిగ్ బాస్ సీజ‌న్ 5కి సంబంధించిన ప‌నులు మొద‌లు కాగా, ఈ కార్య‌క్ర‌మం క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. కొంచెం ప‌రిస్థితులు కుదుట ప‌డ్డాక షోని ప్రారంభించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Payal Rajput

బిగ్ బాస్ సీజ‌న్ 5కి సంబంధించి ఇప్ప‌టికే జూమ్ ద్వారా కంటెస్టెంట్ ఎంపిక ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టార‌ట‌.ఈ సారి పాపుల‌ర్ కంటెస్టెంట్స్‌ని ఫైనలైజ్ కూడా చేశారని జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే Rx 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ కూడా ఈ లిస్టులో ఉందని, బిగ్ బాస్ సీజన్- 5లో ఒక కంటెస్టెంట్‌గా ఆమె ఎంపికైందని ప్ర‌చారాలు చేశారు. గతంలో అర్చన, స్వాతి దీక్షిత్ లాంటి హీరోయిన్లు బిగ్ బాస్‌లో అడుగుపెట్ట‌గా, వాళ్లందరికంటే పాయల్ స్టార్ డం పెద్దది కాబట్టి, ఐదవ సీజన్ బిగ్ బాస్‌కి పాయల్ మంచి మైలేజ్ తెచ్చే అవకాశం ఉంటుంద‌ని నిర్వాహ‌కులు ఆమెని ఎంపిక చేశార‌ని ప్ర‌చారాలు చేశారు.

కొద్ది రోజులుగా వ‌స్తున్న రూమర్స్‌ కు చెక్ చెప్తూ పాయల్ క్లారిటీ ఇచ్చింది. “నేను తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో లేనని అదంతా ఒట్టి ఫేక్ న్యూస్ మాత్రమే అని దయచేసి ఇలాంటి రూమర్ వార్తల్లోకి నన్ను లాగొద్దని వేడుకుంటున్నాని” పాయల్ తెలిపింది. మొత్తానికి సీజ‌న్ 5లో పాల్గొనే కంటెస్టెంట్స్ అంటూ న‌డుస్తున్న లిస్ట్‌లో ఒక‌రి పేరు ఎలిమినేట్ అయింది. పాయల్ ప్ర‌స్తుతం ఓ తమిళ్ హారర్ థ్రిల్లర్ సినిమా చేస్తూ బిజీగా ఉంది.

బిగ్ బాస్ ఐదవ సీజన్ కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. ప్రోమో కూడా ఇంకో పది రోజుల్లో షూట్ చేసి, జులై మొదటి వారంలో ఆ ప్రోమోని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత నాలుగు సీజన్ల బిగ్ బాస్ పెద్ద సక్సెస్ కావడంతో ఈ ఐదవ సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ‌త సీజ‌న్ కంటే భిన్నంగా సీజ‌న్ 5ని ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ప్రైజ్ మ‌నీ కూడా పెంచిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లబోయేది వీళ్లే అంటూ 10 మందితో ఉన్న లిస్టు కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో బాగానే హల్ చల్ చేస్తుంది. అందులో హైపర్ ఆది, శేఖర్ మాస్టర్ సహా షణ్ముఖ్ జస్వంత్ లాంటి పెద్ద పేర్లు కూడా ఉన్నాయి.

1. హైపర్ ఆది
2. శేఖర్ మాస్టర్
3. షణ్ముఖ్ జస్వంత్
4. టిక్ టాక్ దుర్గా రావు
5. టిక్ టాక్ భాను
6. యాంకర్ శివ
7. సింగర్ మంగ్లీ
8. కమెడియన్ ప్రవీణ్
9. యాంకర్ వర్షిణి
10. న్యూస్ యాంకర్ ప్రత్యూష