Payal Ghosh : ఛాన్స్ కోసం వెళ్తే అత్యాచారం చేశాడు.. స్టార్ డైరెక్టర్ పై హీరోయిన్ ఆరోపణలు..!
NQ Staff - March 19, 2023 / 05:17 PM IST

Payal Ghosh : ఈ నడుమ సినిమా ఇండస్ట్రీలో రోజుకో సంఘటన వెలుగు చూస్తోంది. ముఖ్యంగా మీటూ ఉద్యమం తెరపైకి వచ్చినప్పటి నుంచే ఎవరో ఒకరు ఏదో ఒక డైరెక్టర్ లేదంటే నిర్మాత మీద సంచనల ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వారు చేసే ఆరోపణలతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది.
బెంగాళీ బ్యూటీ పాయల్ ఘోష్ తెలుగులో కూడా రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి మూవీలో తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చేసింది. కానీ ఆమెకు సినిమాల ద్వరాఆ పెద్దగా కలిసి రాలేదు. హీరోయిన్ గా కలిసి రాకపోవడంతో ఆమె సీరియల్స్ కూడా చేసింది.
ఆయన మీద కేసు..
అమ్మడి బ్యాడ్ లక్ ఏంటంటే ఆమె ఏం చేసినా పెద్దగా కలిసి రాలేదు. అందుకే ఈ నడుమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఆమె గతంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మీద రేప్ కేసు పెట్టినప్పటి నుంచే సంచలనంగా మారింది. తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఇందులో మరోసారి అనురాగ్ మీద విరుచుకు పడింది.
అనురాగ్ నన్ను మూడో మీటింగ్ లోనే రేప్ చేశాడు అంటూ బాంబు పేల్చింది. ఛాన్సుల కోసం ఆయన వద్దకు వెళ్తే అసభ్యంగా ప్రవర్తించి నన్ను రేప్ చేశాడంటూ ఆరోపించింది. దాంతో ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. చూడాలి మరి ఆమె వ్యాఖ్యలపై ఆ డైరెక్టర్ ఏమైనా స్పందిస్తారో లేదో.