PAWAN KALYAN: ఉప్పెన చిత్రాన్ని వీక్షించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మేన‌ల్లుడిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం

మెగా కాంసౌండ్ నుండి వచ్చి అంద‌రిలో తాను ప్ర‌త్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ఱ‌వ్ తేజ్. డెబ్యూ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఉప్పెన అనే చిత్రంలో న‌టించిన వైష్ణ‌వ్ తొలి సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డుల ప్ర‌భంజ‌నం సృష్టించాడు. భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ‘ఉప్పెన’ బద్దలుకొట్ట‌గా, ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ మూవీ నిలిచింది. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ క‌థ‌గా బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి త‌మ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఇక నెగెటివ్ పాత్ర పోషించిన విజ‌య్ సేతుప‌తి సినిమాకు ప్రాణంగా నిలిచాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమా స‌క్సెస్ లో భాగం అయింది.

మైత్రి మూవీ మేక‌ర్స్‌కు ఈ సినిమా కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. లాక్‌డౌన్ త‌ర్వాత ఓ డెబ్యూ హీరో సినిమా ఇంత మంచి విజ‌యం సాధించ‌డం ప‌ట్ల ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే ఈ సినిమాకు వ‌స్తున్న టాక్‌ని చూసి ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ప్ర‌త్యేక షోలు వేయించుకొని మ‌రీ చూస్తున్నారు. రీసెంట్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ త‌న ఫ్యామిలీతో క‌లిసి ఉప్పెన సినిమాను వీక్షించారు. ఈ సినిమా చూశాక చిత్ర బృందంపై ప్ర‌శంస‌ల జల్లు కురిపించారు. ఇక తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఉప్పెన సినిమాని వీక్షించిన‌ట్టు తెలుస్తుంది.

పంజా వైష్ణ‌వ్ తేజ్ ఫ్యామిలీతో పాటు ఉప్పెన చిత్ర బృందంతో క‌లిసి ప‌వ‌న్ ఉప్పెన సినిమాను వీక్షించార‌ని టాక్. మేన‌ల్లుడు తొలి సినిమాకు ఇంత ఆద‌ర‌ణ ద‌క్క‌డం ప‌ట్ల ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశార‌ట‌. అలానే ఉప్పెనతో అల‌రించిన వైష్ణ‌వ్‌తో పాటు మిగ‌తా చిత్ర బృందంపై కూడా ఆయ‌న ప్రశంస‌లు కురిపించారు. సినిమా రిలీజ్‌కు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లిసిన ఉప్పెన టీం మూవీ ట్రైల‌ర్ చూపించ‌గా, అది చూసిన ప‌వ‌న్ ఈ సినిమా మంచి హిట్ అవ్వ‌డమే కాదు చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని పేర్కొన్న విష‌యం తెలిసిందే. ప‌వన్ ప్ర‌స్తుతం అయ్య‌ప్పనుమ్ కోషియమ్ రీమేక్‌తో పాటు క్రిష్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. మ‌రో వైపు రాజ‌కీయానికి సంబంధించిన కార్య‌క్ర‌మాలు చూసుకుంటూ ఉన్నారు. ఇంత బిజీ టైంలో మేన‌ల్లుడి కోసం ప‌వ‌న్ కొంత స‌మ‌యం కేటాయించ‌డం విశేషం.

Advertisement