pawan kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్.. ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ప‌వర్ స్టార్ స్టన్నింగ్ లుక్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ మానియా గురించి ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించాల్సిన పని లేదు. అతి త‌క్కువ టైంలో అశేష అభిమానగ‌ణాన్ని సంపాదించుకున్న ప‌వ‌న్ అభిమానుల గుండెల్లో దేవుడిగా కొల‌వ‌బ‌డుతున్నాడు. ప‌వ‌న్ పేరు విన‌బ‌డితే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. ఆయన పేరు టాటూలు వేయించుకోవ‌డం, ఇంట్లో ఫొటోలు పెట్టుకొని పూజ‌లు చేయ‌డం, ప‌వ‌న్ బ‌ర్త్‌డే రోజు సేవా కార్య‌క్ర‌మాలు, ఫ్లెక్సీల‌తో ర‌చ్చ చేయ‌డం అభిమానులకు కామ‌న్‌గా మారింది. ఇక ప‌వ‌న్ సినిమా రిలీజైతే థియేట‌ర్స్ ద‌గ్గ‌ర అభిమానులు చేసే సంద‌డి అంతా ఇంతాకాదు. డ‌ప్పుల వాయిద్యాలు, పాలాభిషేకాలు, డ్యాన్స్ ల‌తో ఆ ప్రాంగ‌ణాన్ని సంద‌డిగా మారుస్తుంటారు.

రాజకీయాల వ‌ల‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు రెండు నెల‌ల పాటు సినిమాల‌కు దూరంగా ఉండ‌గా, అన్న‌య్య మాట‌లు విని తిరిగి సినిమాల‌లోకి వ‌చ్చారు. వ‌కీల్ సాబ్ అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు. ఇక ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. వీటి త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్‌తోను సినిమా చేయ‌నున్నాడు. సురేంద‌ర్ రెడ్డి, రాక్ష‌సుడు ఫేం ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలోను ప‌వ‌న్ సినిమాలు చేయ‌నున్న‌ట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇటీవ‌ల అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సినిమా షూటింగ్ లో ప‌వ‌న్, రానాలు జాయిన్ కాగా వీరిపై కీల‌క సన్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె చంద్ర‌.

అల్యూమిని‌యం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సినిమా షూటింగ్ చిత్రీక‌రిస్తున్నారు. అయితే ఈ సినిమాను 2021లో విడుద‌ల చేసే ప్లాన్ లో మేక‌ర్స్ ఉండ‌గా, మూవీని తెలుగు నేటివిటీకి అనుగుణంగానే రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ప‌వ‌న్‌ను హైలైట్ చేసేలా ద‌ర్శ‌కుడు క‌థ‌ను సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. ఈ మూవీపై అభిమానుల‌లోను భారీ అంచ‌నాలు ఉండ‌గా, అభిమానులు త‌మ‌కు న‌చ్చిన స్టైట్‌లో పోస్ట‌ర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని బ్లూ క‌ల‌ర్ ష‌ర్ట్‌, తెల్ల పంచె, చేతిలో టీ గ్లాస్, మీసం మెలేస్తున్నట్టుగా ప‌వ‌న్ క‌ళ్యాన్ లుక్‌ని రూపొందించి పోస్ట‌ర్ త‌యారు చేశారు. దీనికి రుద్ర అనే టైటిల్‌ను జ‌త చేశారు. ఈ పోస్ట‌ర్‌ని చూసి మేక‌ర్స్ కూడా ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఈ పోస్ట‌ర్ నెటిజ‌న్స్‌ను అమితంగా ఆక‌ట్టుకుంటుంది.

Advertisement