Renu Desai: రేణు దేశాయ్ ఆస్తుల విలువ తెలిస్తే అవాక్క‌వ్వ‌డం ఖాయం..!

Renu Desai ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న బ‌ద్రిలో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న రేణు దేశాయ్ కొద్ది రోజుల‌కు ఆయ‌న‌కు స‌తీమ‌ణిగా మారింది. ప‌వ‌న్-రేణూ వైవాహిక జీవితంలో అకీరా, ఆద్య జ‌న్మించారు. కొన్నాళ్ల సంసారం త‌ర్వాత ప‌వ‌న్-రేణూ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో విడాకులు తీసుకున్నారు. ఇక అప్ప‌టి నుండి ప‌వ‌న్, రేణూ దూరంగానే ఉంటున్నారు. పిల్ల‌లు మాత్రం త‌ర‌చు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లుస్తూ ఉంటారు.

అయితే ప‌వ‌న్ నుండి విడిపోయి సింగిల్‌గా ఉంటున్న రేణూ దేశాయ్‌కి ఎన్ని ఆస్తులు ఉన్నాయ‌నే విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పవన్ నుంచి విడిపోయే సమయంలో ఈమెకు భరణం కింద భారీ మొత్తం ఇచ్చాడనే ప్రచారం చాలా రోజుల పాటు జరిగింది. ఈమెకు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి అనేది కొన్ని లెక్కలు బయటపడ్డాయి.

సొంత ఐడెంటిటీ కోసం ప్ర‌య‌త్నిస్తున్న రేణు దేశాయ్ కొన్నాళ్లుగా పూణేలో ఉంటుంది. షూటింగ్స్ ఉప్ప‌ప్పుడు హైద‌రాబాద్ వ‌స్తుంటుంది. ఇటీవ‌ల రేణూ దేశాయ్ హైద‌రాబాద్‌లో సొంత ఇల్లు కొనుకున్నార‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. ఈమె సంపాద‌న గురించి లెక్క‌లు వేస్తే రేణూ దేశాయ్ ప్ర‌స్తుతం ప‌లు షోస్‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తుంది . ఈ కార్య‌క్రమం కోసం రేణూ రెమ్యున‌రేష‌న్ చాలానే ఉంటుంద‌నే టాక్ ఉంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ చాలా మంది ఉండ‌గా, అక్క‌డ కూడాభారీగానే సంపాదిస్తుంది.

అడ‌పాద‌డ‌పా సినిమాలు,ఇత‌ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేస్తూ రేణూదేశాయ్ బాగానే సంపాదించింద‌ట‌. దాదాపు 40కోట్ల వ‌ర‌కు ఆస్తులు ఉంటాయ‌ని ఇన్‌సైడ్ టాక్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఈమెకు ఖరీదైన ఇల్లు ఉంది. మూడు కార్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే పూణేలోనూ కొన్ని స్థిరాస్తులు ఉన్నాయి. న‌టిగా అల‌రించిన రేణూ దేశాయ్ ద‌ర్శ‌కురాలిగా ప్రూవ్ చేసుకోవాల‌ని అనుకుంటుంది.

ప్ర‌స్తుతం క‌రోనా సంక్షోభం ఉన్న నేప‌థ్యంలో ఇంటికే ప‌రిమిత‌మైన రేణూ దేశాయ్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తూ ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంది. డ‌బ్బు సాయం చేయ‌న‌ని డైరెక్ట్‌గా చెప్పిన రేణూ దేశాయ్ వ‌స్తు రూపంలో త‌ప్ప‌కుండా చేస్తానంటుంది. గ‌త ఏడాది క‌రోనా స‌మ‌యంలోను రేణూ దేశాయ్ అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేసి ప్ర‌శంస‌లు అందుకుంది.