Akira Nandan : ట్రెండీ లుక్‌లోకి మారిన అకిరా..! త్వరలో వెండితెరపైకి పవన్ కళ్యాణ్ వారసుడు.!
NQ Staff - December 1, 2022 / 02:57 PM IST

Akira Nandan : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు త్వరలో తెరంగేట్రం చేయబోతున్నాడా.? హీరోగా అకిరానందన్ ఎప్పుడు తెరంగేట్రం చేస్తాడు.? అభిమానుల ముందు ఇలా చాలా ప్రశ్నలున్నాయ్.
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తనయుడు సినిమాల్లోకి వస్తాడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, అదెప్పుడన్నదే సస్పెన్స్. అకిరాకి సంగీతంపై చాలా మక్కువ అని పదే పదే రేణు దేశాయ్ చెబుతుంటుంది. అకిరాకి అత్యంత సన్నిహితుడైన సినీ నటుడు అడివి శేష్ కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెబుతున్నాడు.
వైరల్ అవుతున్న అకిరా ఫొటోలు..
అకిరానందన్ తాజా ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు రేణు దేశాయ్. అకిరా – ఆద్య.. ఇద్దరూ సరదాగా ‘డిష్యుం డిష్యుం’ అంటూ తలపడుతున్న ఫొటోలివి. ఈ ఫొటోల్లో అకిరా లుక్ పూర్తిగా రివీల్ అవడంలేదుగానీ, ట్రెండీగా మారిపోయాడు అకిరా.. అనే విషయం అర్థమవుతోంది.
ప్రస్తుతం ఇంకా చదువులో బిజీగా వున్నాడు అకిరా. స్కూల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.. సంగీతం లాంటి యాక్టివిటీస్‌తో. స్కూల్ అంటే హయ్యర్ స్కూల్.!
ఇదిలా వుంటే, అకిరా వచ్చేస్తున్నాడు.. పవర్ స్టార్ వారసుడి తెరంగేట్రానికి రంగం సిద్ధం.. అంటూ అకిరా ఫొటోల్ని వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.