Pawan Kalyan: మ‌ళ్లీ సినిమా ఫంక్ష‌న్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అంద‌రి గుండెల్లో గుబులు మొద‌లైందిగా..!

Pawan Kalyan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ విష‌యాన్నైన కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్ప‌డం ఆయ‌న స్పెషాలిటీ. ప్ర‌స్తుతం సినిమాలు, రాజ‌కీయాలోను నిజాయితీగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌వ‌న్‌..ఇటీవ‌ల రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రెచ్చిపోయి జ‌గ‌న్ ప్ర‌భుత్వంమీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ఏపీలో సినిమా వసూళ్ల మీద ప్రభావం చూపిందనే టాక్ ఉంది. మరి ఇప్పుడు ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మించిన ‘మహా సముద్రం’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా పవన్ ను రప్పించడానికి ప్రయత్నాలు షురూ అయ్యాయి. అనిల్ సుంకర ఓ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు.

అయితే మెగాస్టార్ తన సన్నిహితుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు మాట ఇచ్చారు. ఆయన పెళ్లి సందడి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు గెస్ట్ గా వస్తానని. దాంతో ఇప్పుడు అనిల్ సుంకర, పవర్ స్టార్ ను అప్రోచ్ అయినట్లు కనిపిస్తోంది. మ‌రి ఆ వేడుక‌లో ప‌వ‌న్ క‌ళ్యాన్ స్పీచ్ ఎలా సాగుతుందో అని అంద‌రిలో టెన్ష‌న్ నెల‌కొంది.

మ‌హా స‌ముద్రం చిత్రంలో శర్వానంద్ – బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తుండగా.. అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘మహా సముద్రం’ ట్రైలర్ – పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మరో వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అక్టోబర్ 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు JRC కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమం జరుగనుందని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ఓకే అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వాలని చూస్తున్నారట.