Pawan Kalyan : మూడో భార్య నుంచీ విడాకులు తీసుకోనున్న పవన్ కళ్యాణ్.?

NQ Staff - January 10, 2023 / 09:12 PM IST

Pawan Kalyan : మూడో భార్య నుంచీ విడాకులు తీసుకోనున్న పవన్ కళ్యాణ్.?

Pawan Kalyan : మొదటి భార్య నందిని, రెండో భార్య రేణు దేశాయ్.! మూడో భార్య అన్నా లెజ్నెవా.. నాలుగో భార్య ఎవరు.? అంటూ పదే పదే వైసీపీ శ్రేణులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తుంటాయి.

వ్యక్తిగత విమర్శల తీవ్రత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నుంచి తీవ్రాతి తీవ్రంగా వుంటుంది.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇంకోసారి విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం వైసీపీ నుంచి తెరపైకొచ్చింది. వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఇంతకీ విషయమేంటి.?

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇదంతా కేవలం దుష్ప్రచారం అని తేలింది. పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవాతో సఖ్యతగానే వుంటున్నారు. ఇరువురి మధ్యా ఎలాంటి అభిప్రాయ బేధాలూ లేవు.

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవడం, ‘యువశక్తి’ పేరుతో జనసేన పార్టీ ఓ భారీ బహిరంగ సభ ఉత్తరాంధ్రలో నిర్వహించనుండడం.. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందనీ, ఈ క్రమంలోనే ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చిందనీ జనసేన ఆరోపిస్తోంది.

అయితే, వైసీపీ మద్దతుదారులు తప్ప, వైసీపీ నేతలెవరూ ఇంతవరకు ఈ విషయమై స్పందించలేదు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us