Pawan Kalyan And Naga Vamsi : ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్: రెమ్యునరేషన్ వెనక్కిచ్చేసిన పవన్ కళ్యాణ్.!

NQ Staff - October 4, 2022 / 01:04 PM IST

Pawan Kalyan And Naga Vamsi : ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్: రెమ్యునరేషన్ వెనక్కిచ్చేసిన పవన్ కళ్యాణ్.!

Pawan Kalyan And Naga Vamsi : పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రినివాస్ కాంబినేషన్‌లో రూపొంది భారీ అంచనాల నడు ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్‌గా మిగిలిపోయింది ‘అజ్ఞాతవాసి’ సినిమా. ఆ సినిమా విషయమై బయ్యర్లు నష్టపోయారన్న ప్రచారం చాలా గట్టిగా జరిగింది. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా.!
ఆ సమయంలో బయ్యర్లు చాలా సపోర్టివ్‌గా వున్నారనీ, వారిని ఆదుకునేందుకు తమవంతు ప్రయత్నం చేశామని నిర్మాత నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్‌కి ఆ బ్యాలెన్స్ ఇవ్వలేదు..

‘ఆ సమయంలో పవన్ కళ్యాణ్‌కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ బ్యాలెన్స్ మా దగ్గరే వుంది..’ అని చెప్పిన నాగవంశీ, ‘మాకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు.. బయ్యర్ల పరిస్థితి ఏంటని అడిగారు. విషయం వివరించాం. బ్యాలెన్స్ అమౌంట్ బయ్యర్లకు ఇచ్చెయ్యాలని చెప్పారు..’ అంటూ వివరించారు.

‘పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సపోర్టివ్‌గా వుంటారు.. ఆయన చేసే చాలా మంచి విషయాలు బయటకు రావు.. వాటిని ఆయన చెప్పుకోరు..’ అని చాలామంది నిర్మాతుల చెబుతుంటారు. ఆ లిస్టులో నాగవంశీ కూడా చేరిపోయారు.

‘అజ్ఞాతవాసి’ సినిమా అప్పట్లో రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us