Pawan kalyan : ‘బద్రి’, ‘కెమెరామ్యాన్ గంగతో రాంబాబు’ సినిమాలు తీసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో ముచ్చటగా మూడో మూవీ రాబోతోంది. దానికి ‘జనగణమన’ అనే అద్భుతమైన టైటిల్ పెట్టాలని కూడా అనుకుంటున్నారట. ఇంతకన్నా విశేషం మరొకటుంది. దాన్ని విశేషం అనే కంటే వింతలకే వింత అని చెప్పుకోవటం కరెక్టేమో.
పదేళ్ల తర్వాత..
నిజానికి ఈ చిత్రాన్ని మొదట ప్రిన్స్ మహేశ్ బాబును హీరోగా పెట్టి తీయాలని పూరీ జగన్నాథ్ భావించాడు. కథ కూడా చెప్పేశాడు. కానీ అటు వైపు నుంచి ఇంతవరకూ స్పందనే రాకపోయేసరికి పూరీ పునరాలోచనలో పడి మళ్లీ పవర్ స్టార్ వైపు ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది. సినిమాకు జనగణమన అనే పేరును పరిశీలిస్తున్నారంటే ఇందులో పొలిటికల్ టచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గంగతోనూ: Pawan kalyan
‘కెమెరామ్యాన్ గంగతో రాంబాబు’లో కూడా రాజకీయాల్ని చూపించిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు ‘జనగణమన’ను కూడా పవన్ కళ్యాణ్ తో తీయటానికి కారణం ఆయన రాజకీయాల్లో ఉండటం. ఓ వైపు సినిమాలు, మరో వైపు పాలిటిక్స్ నడుపుతున్న జనసేనాధినేతకు ‘జనగణమన’ వల్ల పొలిటికల్ మైలేజీ సైతం వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ స్టోరీ పవన్ కళ్యాణ్ కైతే సరిపోతుందనే ఫీడ్ బ్యాక్ వస్తోంది.
ఎప్పుడు?.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. అవన్నీ షూటింగ్ అయిపోయే సరికి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి పూరీ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. బహుశా ఎలక్షన్స్ కి ఏడాది ముందో లేక ఆరు నెలల అడ్వాన్స్ గానో స్టార్ట్ చేసి ఎన్నికల సమయంలో విడుదల చేస్తే బాగుంటుందనే సలహాలు సూచనలు వస్తున్నాయి.

ఒకే దెబ్బకు: Pawan kalyan
పాలిటిక్స్ తో సంబంధం ఉన్న సినిమాలను ఎన్నికల సమయంలో విడుదల చేయటం వల్ల రెండు లాభాలు ఉంటాయి. అటు టికెట్ల రూపంలో నోట్లు, ఇటు ఓట్ల రూపంలో రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ కు దగ్గుతుందని ఆశిస్తున్నారు. దేనికైనా టైం రావాలంటారు కదా. అది మరో రెండేళ్లలో పవన్ కళ్యాణ్ కి రాబోతోందని అంటున్నారు. ఒకే ఇండస్ట్రీలోని ఒక పెద్ద హీరో వద్దంటే వద్దని పక్కన పెట్టిన స్క్రిప్టును ఏకంగా పదేళ్ల అనంతరం మరో టాప్ హీరో చేస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో 30వ సినిమాగా నిలిచిపోనున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.