Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్యగా మ‌ల‌యాళీ బ్యూటీ.. త‌గ్గేదేలే అంటున్న ఫ్యాన్స్

Pawan Kalyan: వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌లయాళంలో సూప‌ర్ హిట్ అమిన అయ‌ప్ప‌నుమ్ కోషియ‌మ‌క్ రీమేక్‌తో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హరిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తున్నాడు. అయితే రానాతో కలిసి పవన్ చేస్తున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ తెలుగు రీమేక్‌ షూటింగ్‌ ఈ నెల 12 నుంచి తిరిగి ప్రారంభం కానుండగా 13వ తేదీ నుంచి పవన్ సెట్స్ పైకి రానున్నారట.‌

రానా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ చంద్ర సిద్దార్థ తెరకెక్కిస్తున్నారు. చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ భార్య రోల్ నిత్యామీనన్ పోషిస్తోందట. తొలిసారి పవన్‌ కళ్యాణ్‌తో జోడీ కడుతున్న ఈ బొద్దుగుమ్మ త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ కానుందట.

నిత్యామీన‌న్ గ‌తంలో చాలా సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అలరించింది. ఇప్పుడు మ‌ల‌యాళంలో వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తుంది. అయితే తొలిసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఈ అమ్మ‌డు ఎంత‌గా ర‌చ్చ చేస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మరో హీరోగా దగ్గుబాటి రానా నటిస్తుండగా.. ఆయన సరసన ఐశ్వర్య రాజేశ్‌ ఆడిపాడుతోంది.

ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ఫినిష్ చేసిన యూనిట్.. మరి కొన్నినెలల్లో మిగిలిన భాగం కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారట. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 12గా ఈ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ రూపొందుతోంది. ఈ సినిమాకు ప‌లు టైటిల్స్ ప‌రిశీలిస్తున్నారు. కాగా, నిత్యా మీనన్ తెలుగులో నటించిన గుండే జారి గల్లంతయ్యిందే , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్న విష‌యం తెలిసిందే.