Pawan Kalyan : రామ్ చరణ్ కు అప్పు ఎగ్గొట్టిన పవన్ కల్యాణ్.. చిరంజీవి ఏమన్నారంటే..?
NQ Staff - March 26, 2023 / 08:10 PM IST

Pawan Kalyan : అవును మీరు విన్నది నిజమే. పవన్ కల్యాణ్ రామ్ చరణ్ దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టాడు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు స్వయంగా పవన్ కల్యాణే. పవన్ కల్యాణ్ ఇప్పుడు అగ్ర హీరోగా ఉన్నారు. ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అలాంటి ఆయనకు అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారు కదా.
అక్కడికే వస్తున్నాం ఆగండి. ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదు. గతంలో జరిగింది. గతంలో రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత ప్రమోషన్ లో భాగంగా చిరు, పవన్, రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో పవన్ మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నా దగ్గర పెద్దగా డబ్బులు ఉండేవి కావు.
పాకెట్ మనీ కోసం ఇస్తే..
అలా అని మా వదినను అడుగుదామంటే సినిమాలు చేస్తున్నావు కదా అని తిడుతుందేమో అని భయం వేసేది. దాంతో ఎవరిని అడగాలో తెలియక రామ్ చరణ్ దగ్గర డబ్బులు తీసుకునే వాడిని. అప్పుడు రామ్ చరణ్ కు మా అన్నయ్య వాళ్లు పాకెట్ మనీ ఇచ్చేవారు. దాన్ని నేను తీసుకునే వాడిని.
తర్వాత వడ్డీతో సహా ఇస్తానని చెప్పాను. కానీ ఇంకా ఇవ్వలేదు అంటూ చెప్పాడు పవన్ కల్యాణ్. ఇక అప్పుడే చిరు మాట్లాడుతూ.. ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ మూవీ గురించి మాట్లాడటానికి వచ్చాడు చూడు.. అదే పదివేలు అంటూ అన్నాడు చిరంజీవి.