Pawan Kalyan : ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ ‘తొలి ప్రేమ’ మూవీ ‘4కె’ విడుదల.!
NQ Staff - January 1, 2023 / 09:52 AM IST

Pawan Kalyan : పాత సినిమాలకు సరికొత్త సాంకేతికత అద్ది, మళ్ళీ వాటిని విడుదల చేయడం ఈ మధ్య ట్రెండింగ్ అవుతోంది. మొన్నామధ్య ‘జల్సా’ సినిమాని అలాగే విడుదల చేశారు. మహేష్ సినిమాల్నీ అలాగే విడుదల చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ సినిమాని కూడా ఆ మధ్య విడుదల చేశారు.
తాజాగా పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమాని రీ-రిలీజ్ చేశారు.. అదీ 4కె ఫార్మాట్లో. ఇంతలోనే, ఇంకో అప్డేట్ వస్తోంది పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి.
సూపర్ హిట్ ‘తొలిప్రేమ’ మళ్ళీ వస్తోంది…
రానున్న ఫిబ్రవరిలో ‘తొలి ప్రేమ’ సినిమాని విడుదల చేయబోతున్నారట. పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం.
సాదారణంగా ఇలా రీ-రిలీజ్లు అంటే, ఛారిటీ కోణంలోనే విడుదలవుతుంటాయి మళ్ళీ. కానీ, అభిమానుల అత్యుత్సాహం నేపథ్యంలో ఈ రీ-రిలీజ్ వివాదాల్లో ఇరుక్కుంటూ వస్తోంది.
పాత సినిమాల సంగతి సరే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న, నటించనున్న సినిమాల విడుదల మాటేమిటి.?