Pawan Kalyan : పవర్ స్టార్ మేనియా.! ‘తమ్ముడు’ సినిమా స్పెషల్ షోకి పోటెత్తిన జనం.!
NQ Staff - September 1, 2022 / 05:49 AM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఇప్పటికే ‘జల్సా’ సినిమాని రీ రిలీజ్ చేశారు.
అత్యధిక ధియేటర్లలో ‘జల్సా’ సినిమాని రిలీజ్ చేశారు. కొత్త సినిమా మాదిరి అడ్వాన్స్ బుకింగ్స్ తదితర హంగామా నడిచింది ఈ సినిమాకి. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’ సినిమాని తాజాగా హైద్రాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ ధియేటర్‌లో రిలీజ్ చేశారు.
జన సంద్రమే..

Pawan Kalyan Thammudu Movie Special Show Crowd
వినాయక చవితి అందులోనూ సెలవు దినం కావడంతో ఈ సినిమా చూసేందుకు జనం పోటెత్తారు. ధియేటర్ ఎదుట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. ఈ స్పెషల్ వీక్షించేందుకు భారీ ఎత్తున ఫ్యాన్స్ తరలి వచ్చారు.
ఈ హంగామా అంతా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రసాద్ మల్టీ ప్లెక్స్‌ని ముంచెత్తిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వరదగా ఈ హంగామాని అభివర్ణిస్తున్నారు నెటిజన్లు.
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ వేడుకను పురస్కరించుకుని గత కొన్ని రోజులుగా పవన్ సినిమాలను స్పెషల్ షోలుగా ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’ సినిమా అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
The POWER STAR Mania ????@PrasadsCinemas flooded with PSPK fans for #Thammudu special show ???@PawanKalyan #PawanKalyan #GaneshChaturthi #ThammuduSpecialShow pic.twitter.com/X9VuWHXWNM
— Indian Clicks (@IndianClicks) August 31, 2022