Pawan Kalyan : అగ్గి తుపాను వస్తోంది.! పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్.!
NQ Staff - December 4, 2022 / 10:10 AM IST

Pawan Kalyan : అనూహ్యంగా కొత్త పేరు తెరపైకొచ్చింది.. ఔను, పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్మెంట్ జరిగిపోయింది. నిజానికి, లిస్టులో సుజీత్ పేరు ఇంతకు ముందు ఎక్కడా వినిపించలేదు.
పైగా, డీవీవీ బ్యానర్ కూడా.! ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని నిర్మించిన డీవీవీ బ్యానర్.. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్.. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వెరసి ‘ఓజీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సినిమా ప్రకటన బయటకు వచ్చింది.
‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’ అంటూ ఇంకో హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశారు. కాస్సేపటి క్రితం ఈ కాంబినేషన్ అధికారికంగా ప్రకటితమైంది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాజకీయాలెలా…?
సినిమాల్లో బిజీ అయితే రాజకీయాలు ఎలా.? ఈ ప్రశ్న చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. రీమేక్ సినిమాలేమీ లేవు ప్రస్తుతానికి. అన్నీ స్ట్రెయిట్ సినిమాలే. అనూహ్యంగా రీమేక్ సినిమాల్ని పక్కన పెట్టేశారు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ కూడా ఒరిజినల్ స్క్రిప్ట్. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే ‘భవదీయుడు భగత్‌సింగ్’ కూడా కొద్ది రోజుల్లోనే లాంఛనంగా ప్రారంభం కాబోతోంది.
అన్న్టట్టు, ‘హ్యాష్‌ట్యాగ్ ఓజీ’ అంటే ఏంటి.? ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అట.!

Pawan Kalyan Sujeeth movie