సాంగ్ తో వకీల్ సాబ్ సెట్ లో అడుగుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్ – శృతిహాసన్ ..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఇటీవలే పవర్ స్టార్ బ్యాలెన్స్ టాకీ పార్ట్ కంప్లీట్ చేసేందుకు వకీల్ సాబ్ సెట్ లో అడుగుపెట్టారు. ట్రావెలింగ్ సీన్స్ తో పాటు పలు కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. అయితే జీహెచెంసీ ఎన్నికల కారణంగా నిలిచిపోయిన షూటింగ్ మళ్ళీ త్వరలో మొదలవబోతోందని తాజా సమాచారం.

Happy Birthday Pawan Kalyan: Here's the intense motion poster of 'Vakeel  Saab' featuring Power Star

ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి మిగిలింది పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మాత్రమే అని అంటున్నారు. ఇందుకోసం పవన్ కాస్త మేకోవర్ కూడా మార్చబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు త్వరలో మొదలయ్యే ఈ సినిమా షూటింగ్ కేరళలో ప్లాన్ చేశారట మేకర్స్. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సాంగ్ ని చిత్రీకరించబోతున్నట్టు .. ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ – శృతిహాసన్ మీద డ్యూయట్ అని అంటున్నారు. ఈ సాంగ్ కంప్లీట్ చేసుకొచ్చిన వకీల్ సాబ్ టీం మిగిలిన టాకీపార్ట్ ని హైదరాబాద్ లో కంప్లీట్ చేస్తారట.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2021 ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేసేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమా కంప్లీట్ కాగానే మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనం కోషియం తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అలాగే క్రిష్ సినిమా కూడా ట్రాక్ ఎక్కుతుందని అంటున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here