Uttej: ఉత్తేజ్ కూతురు పాట‌కి ప‌వ‌న్ త‌న‌యుడు మ్యూజిక్..వీడియో అదిరింది!

Uttej: నటుడు,మాటల రచయిత ఉత్తేజ్ చిన్న కూతురు “పాట” న‌టిగాను , సింగ‌ర్‌గాను తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. అద్భుతంగా పాటలు పాడుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. పాటనే పాపకు పేరుగా పెట్టాలనుకున్న ఉత్తేజ్ కి పాటంటే ఎంతిష్టమో అర్దమవుతుంది . అయితే ఆ పాప “పాట” పెద్ద అయ్యి పాట పాడడమే కాదు,పాటకి ఆట కూడా పాడేస్తుంది..

Akira Nandan Composed Music for Actor Uttje's Daughter Song
Akira Nandan Composed Music for Actor Uttje’s Daughter Song

ఆ మ‌ధ్య రంగమ్మా మంగమ్మా అనే పాటకి పేరడిగా రాంచరణ్ ని ఉద్దేశించి జర్నలిస్టు ప్రభు ఒక పేరడి పాట రాశారు..ఓరయ్యో ఓలమ్మో అంటూ సాగే ఈ పాటకే పాట పాడి ఆడింది.రామ్ చరణ్‌ని,రంగస్థలంలో తన నటనని ప్రశంసలతో ముంచెత్తుతూ ‘రంగస్థలం’ సెట్స్‌లో పాట తన డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఈ పేరడీ సాంగ్ అసలు పాటను మించి ఉండటం విశేషం.ఉత్తేజ్ పెద్ద కుమార్తె చేతన ఈ పాటను డైరెక్ట్ చేసింది.

ఇక ప‌వ‌న్, రేణూ దేశాయ్‌ల ముద్దుల త‌న‌యుడు అకీరా నంద‌న్ మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్‌గా ఎదుగుతున్నాడు. అకీరా కర్రసాము చేస్తున్న వీడియోను ఇటీవ‌ల రేణూ ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా, తండ్రి పవన్‌ కళ్యాణ్‌ జానీ సినిమాలో లాగా కర్ర సాము ఇరగదీస్తున్నాడంటూ అభిమానులు కామెంట్‌ చేశారు. తండ్రికి తగ్గ తనయుడంటూ వ్యాఖ్యానించారు. జానీ-2 పేరుతో అకీరాని పరిచయం చేయమంటూ ఫ్యాన్స్‌ సలహా ఇచ్చారు.

అకీరా సినిమాల‌లోకి ఎంట్రీ ఇస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఇప్పుడే రాడు అని అత‌నికి వేరే ఇంట్రెస్ట్ ఉంద‌ని చెప్పుకొస్తుంది. ఇంజనీరింగ్ కూడా చేయడని, సంగీతం అంటే ఎక్కువగా ఇష్టమని.. అందులోనే మాస్టర్స్ చేస్తాడని రేణూ దేశాయ్ తెలిపారు. ఓసారి పియానో వాయిస్తున్న వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి తెగ మురిసిపోయింది రేణూ.

తాజాగా ఉత్తేజ్ కూతురు పాట.. అందం అమ్మాయి అంటే నీలా ఉంటే అనే పాట‌ని ఆల‌పిస్తుండ‌గా, ఆ పాటకు అకీరా సంగీతాన్ని అందించాడు. ఒకవైపు పాట.. త‌న గాత్రంతో అద‌ర‌గొడుతుంటే, అకీరా సంగీతంతో చించేశాడు. వీరిద్ద‌రికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by renu (@renuudesai)