Pawan Kalyan: సినిమాల‌కు గుడ్ బై చెప్పనున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌ళ్లీ రాజ‌కీయాల‌తో బిజీ..!

Pawan Kalyan: పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. ఆయ‌న పేరులోనే ప్ర‌భంజ‌నం ఉంది. తీసింది త‌క్కువ సినిమాలే అయిన మంచి హిట్స్ సాధించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. ప‌వ‌న్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే థియేట‌ర్స్‌కి బారులు తీరుతూ ఉంటారు. ఆయ‌న సినిమాలు ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాయి.

TheNewsQube-

ప్ర‌స్తుతం భీమ్లానాయ‌క్‌, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాల షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్త‌యిన త‌ర్వాత హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమాతో పాటు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సింది ఉంది. మ‌రికొంద‌రు ద‌ర్శ‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రింత బలోపేతం చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలో త‌న నివాసాన్ని హైద‌రాబాద్ నుంచి విజ‌యవాడ‌కు మార్చాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. అక్క‌డ ఉంటే ప్ర‌జ‌ల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డిపే అవ‌కాశం ఉంటుంది. వారి స‌మ‌స్య‌ల గురించి మాట్లాడే అవ‌కాశం ద‌క్కుతుంది.

ఇక్క‌డ అస‌లు స‌మ‌స్య ఏంటంటే? ప‌వ‌న్ షూటింగుల‌ను హైద‌రాబాద్‌లో చేయాల్సి ఉంటుంది. అంటే ప‌వ‌న్ హైద‌రాబాద్..విజ‌య‌వాడ‌ల‌కు వ‌చ్చి పోవాల్సి ఉంటుంది. అందుకోసం ఓ ప్రైవేట్ జెట్‌లో ఆయ‌న ప్ర‌యాణిస్తారు. అయితే ప్ర‌తి సారి ప్రైవేట్ జెట్‌లో పోవాలి అంటే చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. నిర్మాత‌ల‌పై భారం వేసేందుకు ఇష్ట‌ప‌డ‌ని ప‌వ‌న్ క‌ళ్యాన్ కొన్ని రోజులు సినిమాలు ఆపేయాల‌ని అనుకున్నాడ‌ట‌.

జ‌న‌సేన పార్టీని స్థాపించి కొన్ని నెల‌ల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ‘వ‌కీల్ సాబ్‌’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌ళ్లీ సినిమాలు మానేస్తాడు అనే సరికి అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు