Pawan Kalyan : పవన్ ‘బ్రో’ బిజినెస్ దుమ్ము లేపేశాడు

NQ Staff - May 19, 2023 / 10:35 PM IST

Pawan Kalyan : పవన్ ‘బ్రో’ బిజినెస్ దుమ్ము లేపేశాడు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బ్రో తమిళ సూపర్ హిట్ సినిమా వినోదయ సీతం కి ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా జులై నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కనుక ఈ సినిమాను అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తాలకు కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వస్తున్నట్లు సమాచారం అందుతుంది.

ఈ సినిమాకు దాదాపుగా 125 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చయినట్టుగా తెలుస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ పారితోషికం అత్యధికం. ఈ సినిమా 150 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా సమాచారం అందుకుంది. ఆ విషయమే అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమా రూ. 150 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. థియేట్రికల్‌ రైట్స్ తో పాటు ఇతర రైట్స్ కి కూడా భారీగా రెస్పాన్స్ దక్కింది. అందుకే ఈ స్థాయిలో బిజినెస్ చేసినట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us