Kathi Mahesh: క‌త్తి మ‌హేష్ ప్ర‌మాదంపై తొలిసారి స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Kathi Mahesh: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విమ‌ర్శ‌లు చేస్తూ పేరు తెచ్చుకున్న వారిలో క‌త్తి మ‌హేష్ ఒక‌రు. ఈయ‌న సినీ క్రిటిక్‌గా ఉన్న స‌మ‌యంలో ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న‌ప్ప‌టికీ కొద్ది రోజులు మాత్ర‌మే హౌజ్‌లో ఉండ‌డంతో మ‌హేష్‌కు పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేసి ప‌లు వ్యాఖ్య‌లు చేశాడో అప్ప‌టి నుండి ఆయ‌న పేరు హెడ్ లైన్స్‌లో నిలుస్తూ వ‌చ్చింది. గ‌తంలో ఎన్నో సార్లు క‌త్తి మ‌హేష్‌ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు.

Pawan Kalyan Responds on Kathi Mahesh Issue

Pawan Kalyan Responds on Kathi Mahesh Issue

ఓసారి క‌త్తి మ‌హేష్ వ్యాఖ్య‌ల‌పై నాగ‌బాబు కూడా మండిప‌డ్డాడు.మ‌రోవైపు జ‌న సైనికులు కూడా క‌త్తి మ‌హేష్ పై విరుచుకు ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేదు.అదే ప‌నిగా ప‌వ‌న్‌పై కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. అయితే రీసెంట్‌గా క‌త్తి మ‌హేష్ ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. నెల్లూరు నుండి హైద‌రాబాద్‌కు వ‌స్తున్న స‌మ‌యంలో ఆయ‌న కారు ట్యాంక‌ర్‌ని ఢీకొన‌డంతో క‌త్తి మ‌హేష్‌కి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్ర‌స్తుతం క‌త్తి మ‌హేష్ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న‌ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ సర్కార్ 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల వేసింది. అయితే యాక్సిడెంట్ స‌మ‌యంలో క‌త్తి మ‌హేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అతడి తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే కత్తి మహేష్‌ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండటంతో అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు.

క‌త్తి మ‌హేష్‌కి యాక్సిడెంట్ అని తెలిసిన వెంటనే జ‌న‌సైనికులు పండుగ చేసుకుంటార‌ని అంతా భావించారు. కాని వారు ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధించారు. శత్రువుని కూడా ప్రేమించ‌మ‌ని మా నాయ‌కుడు చెప్పార‌ని వారు అన్నారు. అయితే చాలా రోజుల త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలిసారి క‌త్తి ఆరోగ్య ప‌రిస్థితుల‌పై స్పందించిన‌ట్టు తెలుస్తుంది.

రీసెంట్‌గా విజయవాడ వచ్చిన జనసేనాని అక్కడ మాట్లాడుతూ.. మహేష్ కత్తి యాక్సిడెంట్ గురించి జనసైనికులతో చర్చించినట్లు తెలుస్తుంది.కత్తి ఆరోగ్యం గురించి ఆరా తీయడమే కాకుండా.. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆగర్భ శత్రువు అయినా కూడా మరణించాలని కోరుకూడదని.. భావ వైరుద్యాలకు ప్రత్యర్ధి మరణమే పరిష్కారం అయితే ఈ ప్రపంచంలో మనుషుల కంటే శవాలే ఎక్కువగా ఉంటాయని హూందాగా పవన్ స్పందించినట్లు తెలుస్తుంది. పవన్ స్పందనను మెగాభిమాని, నటుడు జోష్ రవి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసాడు.