Pawan kalyan : పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాధ్ జనగణమన.. లైగర్ తర్వాత సెట్స్ మీదకి ..?

Pawan kalyan : పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాధ్ తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన సినిమాని సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడా .. అవుననే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అంతేకాదు ఇప్పటికే జనగణమన పూర్తి స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లైగర్ తర్వాత ఈ ప్రాజెక్ట్ తో సెట్స్ మీదకి రావాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే లైగర్ కంప్లీట్ అవ్వాల్సి ఉండగా విజయ్ దేవరకొండ తో బాక్సింగ్ లో పోటీ పడే రియల్ బాక్సర్ దొరకలేదని అందుకే డిలే అయిందని తెలుస్తోంది.

pawan-kalyan-Puri Jagannadh Janaganamana with Pawan Kalyan .. on sets after Liger ..?
pawan-kalyan-Puri Jagannadh Janaganamana with Pawan Kalyan .. on sets after Liger ..?

కాగా రీసెంట్ గా లైగర్ షూటింగ్ చాలా నెలల తర్వాత తిరిగి ముంబై లో ప్రారంభం అయింది. రమ్యకృష్ణ కూడా ప్రస్తుతం లైగర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ సమర్పణలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా లైగర్ ని తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాధ్. 120 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ తో పూరి హ్యాట్రిక్ సినిమా ఈసారి మొదలవడం గ్యారెంటీ అనిపిస్తోంది.

కాగా మహేష్ బాబు తో ప్లాన్ చేసిన జనగణమన ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేయబోతున్నాడని అంటున్నారు. వాస్తవంగా పూరి నెక్స్ట్ సినిమా బాలకృష్ణ తో గాని .. యష్ తో గాని ఉంటుందనుకున్నారు. కాని పవన్ కళ్యాణ్ తో పూరి నెక్స్ట్ సినిమా అన్న వార్తలు ఫిల్మ్ నగర్ లో బలంగా వినిపిస్తున్నాయి. ఇక పూరి స్పీడ్ ఏంటో అందరికీ తెలిసిందే. అన్నీ అనుకున్నట్టు కుదరాలేగాని 5 నెలల్లో సినిమాని థియోటర్స్ లో దింపేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కావాల్సింది కూడా ఇదే. ఎంత తక్కువ సమయంలో సినిమా కంప్లీట్ చేగలిగే అన్ని ఎక్కువ సినిమాలు చేసేలా పవన్ ప్లాన్ చేసుకున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ తో పూరి హ్యాట్రిక్ సినిమా ఈసారి మొదలవడం గ్యారెంటీ అనిపిస్తోంది.

Advertisement