Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ మాత్రమే కాదు. వండర్ ఫుల్ మ్యాన్ కూడా..

Kondala Rao - April 13, 2021 / 07:54 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ మాత్రమే కాదు. వండర్ ఫుల్ మ్యాన్ కూడా..

Pawan Kalyan : ‘వకీల్ సాబ్’ మూవీ వచ్చి ఐదు రోజులవుతున్నా.. హిట్ టాక్ సొంతం చేసుకున్నా.. ఇంకా వివిధ రూపాల్లో ప్రమోషన్ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ మంగళవారం హైదరాబాద్ లో ‘మగువా ఇది నీ విజయం’ పేరుతో సక్సెస్ మీట్ ని ఏర్పాటుచేశారు. ఇందులో ఆ సినిమా యూనిట్ తో పాటు పలు రంగాల్లోని ప్రముఖ మహిళలు పాల్గొన్నారు. ముందుగా తెలుగు సినీ దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ తనకు పవన్ కళ్యాణ్ తో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంత గొప్ప, సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించినందుకు డైరెక్టర్ శ్రీరామ్ వేణు, ప్రొడ్యూసర్ దిల్ రాజు తదితరులకు కంగ్రాట్స్ చెప్పారు.

Pawan Kalyan : pawan kalyan not only vakeel saab. he is a wonderful man

Pawan Kalyan : pawan kalyan not only vakeel saab. he is a wonderful man

ఒక్కసారే.. అయినా..

‘‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నేను నా జీవితంలో ఇప్పటికి ఒక్కసారి మాత్రమే కలిశా. అయినా అది నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమొరీగా మిగిలిపోయింది. ఆయన చాలా నార్మల్ గా ఉంటారు. నన్నెంతో గౌరవించారు. నన్నే కాదు. మహిళలందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి. ఆయన ప్రభావం ఈ సమాజంపై చాలా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ఈ వకీల్ సాబ్ పిక్చర్ చేస్తున్నారంటే సంతోషించా. ఆయన లాంటి పెద్ద హీరో చేస్తేనే ఆ మేసేజ్ ఈ రేంజ్ లో ప్రజల్లోకి ఎక్కుతుంది’’ అని నందినీ రెడ్డి తెలిపారు.

మహిళలకో ధైర్యం: Pawan Kalyan

‘‘వకీల్ సాబ్’ ఫిల్మ్ ఈ సొసైటీలోని మహిళలకు ఒక ధైర్యాన్ని, మార్గాన్ని చూపింది. ఆడవాళ్ల పట్ల ఎవరైనా తప్పుగా బిహేవ్ చేశారనిపిస్తే వాళ్లను చూసి భయపడకూడదని, నిలదీయాలని, న్యాయస్థానంలో నిలబెట్టాలని ఈ చిత్రం చెబుతోంది. ఈ రోజుల్లో ఇలాంటి మంచి కథలు తెరకెక్కటం సంతోషకరం. మహిళలకు వాళ్లలో ఉన్న శక్తి వాళ్లకు తెలియదు. మనం చేయాలనుకుంటే ఎంత కష్టమైన పనైనా చేయగలం. అమ్మాయిలు వాళ్లకు నచ్చిందే చేయాలి. ఎవరి ఒత్తిడికీ, ప్రలోభాలకీ లొంగిపోకూడదు’’ అని న్యాయమూర్తి ఉదయగౌరి అన్నారు. ఈమె గత 30 ఏళ్లుగా జడ్జిగా పనిచేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ మూవీ ఎలా ఉందో తనదైన శైలిలో తీర్పు ఇచ్చారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us