Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ లడ్డు బాబు ఇప్పుడు హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

NQ Staff - September 27, 2022 / 05:04 PM IST

Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ లడ్డు బాబు ఇప్పుడు హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

Pawan Kalyan : ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే చాలా సంవత్సరాల క్రితం ఫోటో అయ్యి ఉంటుంది అని అర్థమవుతుంది, ఇక పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ లడ్డు బాబు ఎవ్వరా అని మీరు ఆలోచిస్తున్నారు కదా… కొద్ది మందికి ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది.. కొద్ది మంది మాత్రం ఎక్కడో చూసినట్లు ఉంది అనుకుంటూ ఉంటారు.

కొద్ది మంది మాత్రం ఎవరో పవన్ కళ్యాణ్ అభిమాని అయి ఉంటాడు అని అనుకుంటున్నారు.. అంతే కదా..? అసలు విషయం ఏంటంటే ఈ లడ్డు బాబు మరెవ్వరో కాదండి అల్లు అరవింద్ గారి చిన్నబ్బాయి, అదేనండి మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్. హీరోగా ఈయన ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం పూర్తయింది.

ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ లేక అడపా దడపా సినిమాలు చేసుకుంటూ కెరియర్ అలా అలా నెట్టుకొస్తున్నాడు. పాపం పవన్ కళ్యాణ్ తో ఫోటో అయితే దిగాడు కానీ కళ్ళు మూసుకొని కాస్త లావుగా ఉండడంతో ఇన్నాళ్లు ఈ ఫోటో ఎక్కడ దాచినట్లు ఉన్నాడు. అది ఇప్పుడు బయటపడింది.

ఈ ఫోటో మీకోసం మేము తీసుకొచ్చాం, అల్లు శిరీష్ నవంబర్ నెలలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మరో పవన్ కళ్యాణ్ రాజకీయాలు మరియు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. త్వరలోనే హరిహర వీరమల్లు సినిమా పునః ప్రారంభించేందుకు గాను పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో డేట్ లు ఇచ్చాడట. వచ్చే సమ్మర్ లో హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Pawan Kalyan old photo goes viral

Pawan Kalyan old photo goes viral

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us