Pawan Kalyan : గాడ్‌ ఫాదర్‌ ని లైట్‌ తీసుకున్న పవన్ కళ్యాణ్‌.. కారణం ఇదే!

NQ Staff - September 23, 2022 / 04:01 PM IST

Pawan Kalyan : గాడ్‌ ఫాదర్‌ ని లైట్‌ తీసుకున్న పవన్ కళ్యాణ్‌.. కారణం ఇదే!

Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దసరా సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అనంతపురం లో నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి.

Pawan Kalyan May Not Attend Godfather Event

Pawan Kalyan May Not Attend Godfather Event

ఇప్పటికి గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు అంటూ మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కనిపించబోవడం లేదు, ఎందుకంటే ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అక్టోబర్ రెండో వారంలో కానీ ఆయన అమెరికా నుండి ఇండియాకు వచ్చే పరిస్థితి లేదంటూ జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు.

జనసేన పార్టీ కోసం ఫండ్‌ రైజింగ్ కోసం అమెరికా వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వస్తాడు.. సినిమాకు బజ్ క్రియేట్ చేస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ అమెరికాలో ఉండడంతో ఆయన అభిమానులు తీవ్రంగా నిరాశ వ్యక్తం చేస్తున్నారుగాడ్ ఫాదర్ సినిమాకి ఇప్పటికే పెద్దగా అంచనాలు లేవు, ఈ సమయంలో ఆయన కూడా హ్యాండ్ ఇవ్వడంతో మరింతగా సినిమా కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us