Pawan kalyan : పవన్ కళ్యాణ్ డబుల్ ఎనర్జీతో రెడీ..ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్..!

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ మంచి హిట్ అందుకున్నాడు. ఒటీటీలోనూ ఈ సినిమా సత్తా చాటింది. పవర్ స్టార్ ఇమేజ్ కి దూరంగా చేసిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ మెప్పించింది. అంతేకాదు పలువురు ప్రశంసలు అందుకుంది. ఇదే ఊపుతో మరో రెండు సినిమాలను సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు. రెండు సినిమాల సెట్స్ కూడా పక్క పక్కనే ఉండేలా నిర్మాతలకి సలహా ఇచ్చి సమాంతరంగా షూటింగ్ చేశాడు.

pawan-kalyan is ready with double energy
pawan-kalyan is ready with double energy

అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇక ఇప్పట్లో ఆయన షూటింగ్ కి హాజరవడని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ డబుల్ ఎనర్జీతో సెట్ లో అడుగు పెట్టేందుకు రెడీ అయ్యాడట. ఇంతక ముందు మాదిరిగానే ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. మేకర్స్ కి కూడా ఇదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది.

Pawan kalyan : అనుకున్నట్టుగా పూర్తయితే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. మొఘలుల కాలం నాటి పీరియాడికల్ కథలో మొదటి సారి నటిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. 2022 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఏకే రీమేక్ కూడా సెట్స్ మీదకి రానుంది. పవర్ స్టార్ తో పాటు రానా దగ్గుబాటి కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టుగా పూర్తయితే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.