Pawan kalyan : పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమాకి టైటిల్ ఫిక్స్..?

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశారు పవర్ స్టార్ – హరీష్ శంకర్. అప్పటి నుంచి మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందో అని మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకి ఈ కాంబినేషన్ ని మైత్రీ మూవీ మేకర్స్ సెట్ చేశారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించబోతున్నారు. మరికొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా దేశ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

pawan-kalyan-harish-shanker-movie-title-is-fixed
pawan-kalyan-harish-shanker-movie-title-is-fixed

ఇప్పటికే వకీల్ సాబ్ లాభాలను తీసుకు వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. 22 ఏళ్ళ దిల్ రాజు కల వకీల్ సాబ్ తో నెరవేరింది. అంతేకాదు కరోనా వల్ల ఎలాంటి ప్రభావం లేకుండా దిల్ రాజుకి భారీగా లాభాలు వచ్చే అవకాశాలున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఇక పవన కళ్యాణ్ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

Pawan kalyan : “సంచారి” టైటిల్ ఫైనల్ అవుతుందా.. లేక మరో టైటిల్ ని పరిశీలిస్తారా చూడాలి.

అలాగే మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం కూడా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమా మొదలవనుంది. ఈ సినిమాలో “సంచారి” అన్న టైటిల్‌ని మేకర్స్ రిజిస్టర్ చేయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాని ప్రకారమే ఈ టైటిల్ ని పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఇదే టైటిల్ ఫైనల్ అవుతుందా.. లేక మరో టైటిల్ ని పరిశీలిస్తారా చూడాలి.

Advertisement