Pawan Kalyan : ఆ సినిమా కోసం పవన్ కేవలం 30 రోజులే..!
NQ Staff - January 30, 2023 / 09:28 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా రాజకీయం కూడా చేసిన విషయం తెలిసిందే. ఫుల్ టైం రాజకీయం చేస్తూ పార్ట్ టైం సినిమాలు చేస్తూ రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నాడు పవన్.
ఆ కారణంగానే సినిమాలకు న్యాయం చేయలేక పోతున్నాడు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ప్రారంభం అయ్యి చాలా నెలలు అయింది. రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఇప్పటి వరకు ఆ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు.
అందుకే ఇక నుండి చేయబోతున్న ప్రతి సినిమా కూడా చాలా తక్కువ రోజుల్లో పూర్తయ్యేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే నేడు ప్రారంభం అయినా సుజిత్ దర్శకత్వంలోని సినిమాకు కేవలం 30 రోజుల డేట్స్ మాత్రమే పవన్ కళ్యాణ్ కేటాయించాడట.
30 రోజుల లోపే ఆ సినిమా ను పూర్తి చేసేలా దర్శకుడు సుజిత్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలోనే దసరాకు లేదా అంతకు ముందే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.